Vasantha Krishna Prasad: హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరానని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే చంద్రబాబు రావాలన్నారు. మైలవరంలో గడిచిన ఆరేళ్లుగా వైసీపీని బలోపేతం చేశానని ఆయన తెలిపారు. మైలవరంకు సీఎం నిధులు ఇవ్వలేదని వసంత విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు.
Read Also: Vasantha Krishna Prasad: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే
సీఎం జగన్ కు ఇచ్చిన వినతి పత్రాలు అన్ని బుట్టదాఖలు అయ్యాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చారని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. తనతో పాటు రావాలనుకునే నియోజకవర్గ నేతలను జగన్ ఆపారన్నారు. జగన్ తోనే పని చేస్తానని అనేక సార్లు బల్లగుద్ది చెప్పానన్నారు.
కలిసిన ప్రతిసారి నిధులు ఇస్తానని చెప్పారు కానీ చేయలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానన్నారు. మైలవరమా ఇంకొక్కటా అనేది ఇంకా తెలియదు.. పార్టీ ఎక్కడ చెబితే అక్కడ పని చేస్తానన్నారు.