Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసు అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కొన్ని అరాచక శక్తులు మా ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
కొప్పుగుండపాలెం గ్రామానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత రాబోతున్నారు. మృతురాలి బంధువులను కలిసి పరామర్శించునున్నారు. విద్యార్థిని దారుణ హత్యకు గురవడంతో గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. నిందితుడిని తమకు అప్పగించాలంటూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Anakapalli: అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం పరిధిలోనీ కొప్పు గొండు పాలెంలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి హత్య చేశాడు.
Vangalapudi Anitha: నేడు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై మంత్రి మాట్లాడారు. ఇందులో ముఖ్యంగా గత ఐదేళ్ళు పోలీసు వ్యవస్ధ నిర్లక్ష్యం చేయబడింది., పోలీస్ డిపార్టుమెంటుకు ఏం కావాలని అనే అంశాలు పట్టించుకోలేదని., పోలీసు అకాడమీ, గ్రేహౌండ్ అకాడమీ లేదంటూ ఆవిడ మాట్లాడారు. మహిళలపై నేరాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని. విశాఖలో ఆరిలోవ పోలీసు స్టేషన్ రేకుల షెడ్డులో, చెట్ల కింద ఉందని ఆమె పేర్కొన్నారు.…
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి సుచరిత అత్యాచారం, హత్య జరిగిన ఘటనా స్థలాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. సుచరిత కుటుంబ సభ్యులను హోం మంత్రి అనిత పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఏపీలో గంజాయి లేకుండా చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలో గంజాయి కట్టడికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గంజాయికి సంబంధించి ఏపీ సర్కారు బంపరాఫర్ ఇచ్చింది. గంజాయికి సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చిన వారికి నగదు రివార్డు ఇస్తామని హోంమంత్రి వెల్లడించారు.
ఉత్తరాంధ్రలో ఎస్సీ రిజర్వ్ సీటు అది. అక్కడ తాము గెలవడం కంటే టీడీపీ అభ్యర్ధిని అష్టదిగ్భంధనం చేయడమే టార్గెట్గా పనిచేస్తున్నాయట వైసీపీ శ్రేణులు. ఎత్తులు, పై ఎత్తులతో పొత్తుల గోడలను బద్దలు కొడతామని ఛాలెంజ్ చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఆ సీటు వైసీపీకి ఎందుకంత స్పెషల్? అక్కడున్న మహిళా నేత అంటే ఎందుకంత మంట? ఎవరా లీడర్? ఏంటా కథ? ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో మిగతా అన్ని సీట్లు ఒక లెక్క. పాయకరావుపేట ఒక లెక్క…