Home Minister Anitha: ఢిల్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్ ధర్నాపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు సిద్దాంతాలు ఉంటాయి.. కానీ వైసీపీకి అబద్ధపు, ప్రచారాలు నంగనాచి కబుర్లు చెప్పడమే సిద్దాంతం.. వై నాట్ 175 అని కబుర్లు చెప్పి 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ అని ఆరోపించారు. రాష్ట్రంలో మొహం చెల్లడం లేదు.. ప్రతిపక్షాలకు గౌరవం ఇవ్వకుండా మిడిసి పడ్డారు.. రాజకీయాలకు సంబందం లేని వినుకొండ హత్యను రాజకీయం చేస్తున్నారు.. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తుగ్లక్ రెడ్డి ధర్నా చేపట్టారు అని విమర్శించారు. జగన్ నిద్రలో కూడా రెడ్ బుక్ ను తలచుకుంటున్నాడు.. జగన్ కు పెట్టుబడులు తీసుకు రావడం చేత కాలేదు అని హోంమంత్రి అనిత అన్నారు.
Read Also: Simbaa : జగపతిబాబు, అనసూయల ‘సింబా’ ట్రైలర్ టాక్..!
ఇక, పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు పెట్టడానికి జగన్ కు మొహం చెల్లడం లేదు అని మంత్రి అనిత తెలిపారు. సీఎం చంద్రబాబు పెట్టుబడులు తెస్తుంటే అడ్డుకోవడానికి జగన్ ఢిల్లిలో ధర్నాలు చేస్తున్నాడు.. జగన్ ఢిల్లీలో పెట్టిన ఎగ్జిబిషన్ లో బాబాయ్ హత్య కేసు, తోటా చంద్రయ్య హత్య కేసుల ఫోటోలు కూడా పెట్టాలి అని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వంలో 36 రాజకీయ హత్యలు జరిగాయని పులివెందుల ఎమ్మెల్యే చెప్తున్నారు.. ఆధారాలతో సహా వస్తే చర్చకు సిద్ధం.. గతంలో జగన్ ఢిల్లి పర్యటనలు కేసుల మాఫీ కోసం జరిగేవి.. వినుకొండ హత్య కేసు రాజకీయం చేస్తున్నారని జగన్ సోదరి షర్మిల చెప్తుంది.. ఇండియా కూటమి నాయకులకు వాస్తవాలు తెలియక జగన్ ధర్నా దగ్గరకు వెళ్ళి ఉంటారు.. అడుక్కుంటే వచ్చేది ప్రతిపక్ష హోదా కాదు.. ప్రజలు ఇవ్వాలి అని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.