అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి మే 2న ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని సభ జరిగే ప్రాంతాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించగా.. తాజాగా హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని రాక సందర్భంగా 6 వేల మందితో భద్రత ఏర్పాటు చేసినట్లు మంత్రి అనిత చెప్పారు.
Also Read: TGSRTC Strike: ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. ఎప్పటినుంచంటే?
‘గత ప్రభుత్వంలో ప్రజా వేదిక కూల్చివేత నుంచి విధ్వంస పాలన చేశారు. కానీ సీఎం చంద్రబాబు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అమరావతి కోసం రైతులు ఎన్నో త్యాగాలు చేశారు. అమరావతి కోసం గతంలో బస్ యాత్ర చేస్తే రాళ్ళ దాడి చేశారు. అమరావతిని మళ్లీ ప్రారంభించడం వెనక ఎంతో ఆవేదన శ్రమ ఉన్నాయి. రైతుల న్యాయ పోరాటం సహా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గార్ల కృషి వల్ల అమరావతి పనులు రీ లాంచ్ అవుతున్నాయి. ఏపీలో ఒక పండగ వాతావరణంలో రాజధాని రీ లాంచ్ కార్యక్రమం జరుగుతోంది’ అని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.