Vangalapudi Anitha: అమరావతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఇటీవల వైస్సార్సీపీ నాయకుల మాటలు రాష్ట్ర గౌరవాన్ని భంగపరచేలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అమరావతిని కించపరిచేలా పదాలను ఉపయోగించడంపై తీవ్ర అభ్యంతరకరం చేసారు. అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి అక్కసు.. మూడు రాజధానులు పేరుతో విషం కక్కారని హోం మంత్రి వ్యాఖ్యానించారు. వైసీపీ పాలన మొదటి నుంచీ అమరావతిని నిర్లక్ష్యం చేయడమే లక్ష్యంగా తీసుకున్నట్లు ఆమె ఆరోపించారు.
Read Also: Janasena: మట్టి తవ్వకాలలో రెండు వర్గాలుగా విడిపోయి వీధికెక్కిన జనసేన నేతలు.. ఆపై దాడులు..!
అమరావతి సాధన పోరాటంలో 270 మంది చనిపోయారు. ఇప్పుడు పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతుంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారు? అని ఆమె ప్రశ్నించారు. అమరావతిని వేశ్యల రాజధాని అని అభద్రంగా చెప్పే వారిని ప్రోత్సహించిన వారెవరో బయట పెట్టాలని ఆమె స్పష్టం చేశారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన మీటింగ్‌లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించేలా మాట్లాడారని, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమంటే మహిళలను కించపరచడమా? అని అనిత ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పేరు దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె అన్నారు.
Read Also: French Open 2025 Final: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. స్టార్ ఆటగాడి ఆశలపై నీళ్లు..!
ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతీ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యల వెనుక కుట్రదారులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం. వారి పత్రిక, ఛానల్‌పై ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఇక కృష్ణం రాజు కుమార్తెపై టీడీపీ సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై స్పందిస్తూ, ఆ వ్యాఖ్యలు కూడా తప్పేనని చెప్పాను. ఆ పోస్టులను తొలగించమని సూచించానని అనిత చెప్పారు. ఒక వ్యక్తి చేసిన మూర్ఖపు వ్యాఖ్యలను ఖండించాలి. కానీ అమరావతి రైతులు, మహిళల మధ్యకి వెళ్లి నిజంగా చెప్పగల ధైర్యం ఎవరికి ఉందొ చూడాలి అంటూ విమర్శల దాడి చేశారు.