Minister Anitha: కృష్ణా జిల్లాలో పర్యటించిన హోం మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేసింది. కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలని జగన్ చూస్తున్నారు అని ఆరోపించింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు పర్యటనలను అడ్డుకున్నది మీరు కదా?.. నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు.. అవినీతి, అరాచకానికి మీరు విత్తనం వేశారు.. వివేకా హత్యతో ఆ విత్తనం పెరిగింది.. సినిమా డైలాగు బ్యానర్ లో వేస్తే తప్పుకాదు అంటున్నారు.. మరి, గతంలో పట్టాభి బోస్ డీకే అంటే ఎందుకు అరెస్ట్ చేశారు అని ప్రశ్నించింది. మా కార్యకర్తలకు పునకాలు వచాయి.. అందుకే టీడీపీ ఆఫీసుపై దాడి చేశారని అన్నారు.. బోస్ డీకే కూడా సినిమా డైలాగ్ కదా?.. రప్పా రప్పా అంటూ నరుకూతామంటే కేసులు పెట్టారా అని మంత్రి అనిత అడిగింది.
Read Also: Anaswara Rajan: స్పీడు మీదున్న అనశ్వర రాజన్
ఇక, అధికారంలోకి వచ్చిన తర్వాత మా వాళ్ళు నా మాట వినరు అంటూ బెదిరిస్తున్నారా అని హోంమంత్రి అనిత పేర్కొనింది. పేర్ని నాని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. కుటుంబ సభ్యులను కూడా విమర్శిస్తున్నారు.. చీకటిలో వేసెయ్యలా.. చంద్రబాబు ఇంకా ఎంతకాలం బతుకుతాడు అంటున్నాడు.. వైసీపీ వాళ్లు దిగజారి మాట్లాడుతున్నారు అని మండిపడింది. ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఎలా?.. గత ప్రభుత్వంలో పెట్టిన కేసులపై.. ఇప్పుడు నమోదు అవుతున్న కేసులపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరింది.. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారని జగన్ అంటున్నారు.. ఆయన ప్రశాంతి రెడ్డిని ఎలాంటి మాటలు అన్నారని అడిగింది. ప్రసన్న వ్యాఖ్యలను కోర్టు కూడా తప్పుబట్టింది.. సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడిన వ్యక్తి జగన్.. ఆయన నుంచి మంచిని ఆశించడం సరికాదు అని వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేసింది.