గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు.. ఇప్పటికే ఐదు కేసులో వల్లభనేని వంశీ మోహన్‌కు.. బెయిల్, ముందస్తు బెయిల్‌లు ఉండగా.. ఇప్పుడు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ వంశీకి బెయిల్ వచ్చేసింది.. అయితే, ఈ కేసులో బెయిల్ వచ్చినా.. వేరే కేసులో రిమాండ్ విధించడంతో.. వల్లభనేని వంశీ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది..
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి కోర్టు రిమాండ్ విధించింది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై కేసు నమోదైంది. పోలీసులు పిటీ వారెంట్ దాఖలు చేసి వంశీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 29 వరకు కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారావుకి కూడా రిమాండ్ విధించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని వంశీపై కేసు నమోదైంది. మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్‌లో వంశీపై పిర్యాదు చేశారు. అక్రమ తవ్వకాలపై నివేదికను ఆయన పోలీసులకు అందించారు. 2019-2024 సమయంలో వంశీ, ఆయన వర్గం అక్రమాలపై పాల్పడినట్టు నివేదికలో పేర్కొన్నారు. 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేశారు. మైనింగ్ ఏడీ ఫిర్యాదు మేరకు…
వల్లభనేని వంశీ మోహన్‌కు ఊహించని ఝలక్ తగిలినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీపై హనుమాన్ జంక్షన్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు.. వంశీపై మొత్తం ఆరు కేసులు నమోదు కాగా.. ఇప్పటికే ఐదు కేసుల్లో వంశీకి బెయిల్, ముందస్తు బెయిల్ మంజూరు అయ్యాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాత్రం.. వంశీ బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు వెల్లడించనుంది కోర్టు.. అయితే, ఈ సమయంలో బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో మాజీ…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. జైల్లో ఉన్న వంశీ అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంతో ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రి వద్దకు వైసీపీ వర్గీయులు భారీగా చేరుకున్నారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. Also Read:CM Revanth Reddy :…
వల్లభనేని వంశీ నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ కోర్టుకు తెలిపారు.. నాకు అనారోగ్యంగా ఉందని కోర్టుకు తెలిపిన వంశీ.. తాను మాట్లాడేందుకు కూడా ఇబ్బంది ఉందని.. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాను అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు..
వల్లభనేని వంశీకి షాక్ ఇస్తూ.. మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు..
వల్లభనేని వంశీ మోహన్ అస్వస్థతకు గురయ్యారు.. వెంటనే విజయవాడ సబ్ జైలు నుంచి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు.. బ్యాక్ పెయిన్, వాళ్లు వాయటంతో ఇబ్బంది పడుతోన్న వంశీని.. ఆస్పత్రికి తీసుకెళ్లారు జైలు అధికారులు.. బెజవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు
రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తోంది.. సంగారెడ్డి జిల్లాలోని రుద్రారంలో గల గణేష్ గడ్డ ఆలయంలో మాజీ మంత్రి హరీష్ రావు పూజలు నిర్వహించారు. పటాన్ చెరు బీఆర్ఎస్ నేత ఆదర్శ్ రెడ్డి పాదయాత్రకు మద్దతుగా పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తోంది.. ఏడాది కాంగ్రెస్ పాలనలో పాలేవో.. నీళ్ళేవో ప్రజలకు తెలిసిపోయింది అని మండిపడ్డారు. ఆనాడు LRS ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడు ముక్కు పిండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది.. వంశీ రిమాండ్‌ను మళ్లీ పొడిగించింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు.. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది కోర్టు..