Vallabhaneni Vamsi: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు.. ఇప్పటికే ఐదు కేసులో వల్లభనేని వంశీ మోహన్‌కు.. బెయిల్, ముందస్తు బెయిల్‌లు ఉండగా.. ఇప్పుడు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ వంశీకి బెయిల్ వచ్చేసింది.. అయితే, ఈ కేసులో బెయిల్ వచ్చినా.. వేరే కేసులో రిమాండ్ విధించడంతో.. వల్లభనేని వంశీ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది..
Read Also: Naga Chaitanya: చైతూ లుక్ అదిరింది బాసూ
కాగా, వల్లభనేని వంశీకి మరోసారి కోర్టు రిమాండ్ విధించిన విషయం విదితమే.. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై కేసు నమోదైంది. పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి.. వంశీని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా వల్లభనేని వంశీకి కోర్టు రిమాండ్ విధించింది.. వంశీ పై మొత్తం 8 కేసులు ఉండగా అందులో ఐదు కేసుల్లో ఇప్పటికే బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చింది. ఇక, గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులోనూ ఈ రోజు బెయిల్ వచ్చింది.. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసు, తాజాగా నమోదైన మైనింగ్ కేసులో వంశీకి ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న వల్లభనేని వంశీ.. కిడ్నాప్ కేసులో అరెస్టు అయ్యారు. ఇప్పటికే 93 రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజా కేసుల్లో బెయిల్ వచ్చే వరకు వల్లభనేని వంశీ జైల్లో ఉండక తప్పదన్నమాట..