Vallabhaneni Vamsi Health Problems: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ కోర్టుకు తెలిపారు.. నాకు అనారోగ్యంగా ఉందని కోర్టుకు తెలిపిన వంశీ.. తాను మాట్లాడేందుకు కూడా ఇబ్బంది ఉందని.. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాను అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. వల్లభనేని వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్సలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.. జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం.. వైద్య పరీక్షలు నిర్వహించి.. రిపోర్టులు ఇవ్వాలని న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
Read Also: Saraswati Pushkaralu: ఈ నెల 15 నుంచి 26 వరకు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు..
కాగా, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ, మరో ఐదుగురిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.. దీంతో, రేపటి వరకు ఒక్కరోజు రిమాండ్ పొడిగించింది కోర్టు.. ఇదే కేసులో వల్లభనేని వంశీ మూడోసారి వేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువరించనుంది కోర్టు.. ఇక, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి రేపటి వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు.. వల్లభనేని వంశీని కోర్టు నుంచి జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.. మధ్యాహ్నం లంచ్ తర్వాత వంశీ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రానుండడంతో ఉత్కంఠ నెలకొంది..