వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని వంశీపై కేసు నమోదైంది. మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్‌లో వంశీపై పిర్యాదు చేశారు. అక్రమ తవ్వకాలపై నివేదికను ఆయన పోలీసులకు అందించారు. 2019-2024 సమయంలో వంశీ, ఆయన వర్గం అక్రమాలపై పాల్పడినట్టు నివేదికలో పేర్కొన్నారు. 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేశారు. మైనింగ్ ఏడీ ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ సహా 8 మందిపై కేసు నమోదైంది.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీలో ఎలాంటి విచారం లేదు: రవిశాస్త్రి
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఇప్పటికే విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈరోజు బెయిల్ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో తీర్పు రానుంది. ఈ కేసులో బెయిల్ వచ్చినా.. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధిస్తే వంశీకి మరలా జైలు తప్పదు. ఇది చాలదన్నట్టు నేడు మరో కేసు నమోదయింది. ప్రస్తుతం వంశీపై మూడు కేసులు ఉన్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, నకిలీ ఇళ్ల పట్టాల కేసు, అక్రమ మైనింగ్ కేసులు ఆయనపై ఉన్నాయి.