Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఊహించని ఝలక్.. మరో కేసులో పీటీ వారెంట్..
- మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు ఊహించని ఝలక్..
- వంశీపై పీటీ వారెంట్ దాఖలు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు..
- బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో కేసు..
- వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ దాఖలు చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు ఊహించని ఝలక్ తగిలినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీపై హనుమాన్ జంక్షన్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు.. వంశీపై మొత్తం ఆరు కేసులు నమోదు కాగా.. ఇప్పటికే ఐదు కేసుల్లో వంశీకి బెయిల్, ముందస్తు బెయిల్ మంజూరు అయ్యాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాత్రం.. వంశీ బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు వెల్లడించనుంది కోర్టు.. అయితే, ఈ సమయంలో బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో మాజీ ఎమ్మల్యే వల్లభనేని వంశీపై నమోదైన కేసులో ఇవాళ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై న్యాయమూర్తి ఇవాళ అనుమతి ఇస్తే.. వల్లభనేని వంశీకి రేపు బెయిల్ వచ్చినా.. జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉండదన్నమాట… ఇవాళ పీటీ వారెంట్ పై న్యాయమూర్తి ఆదేశాలు ఇస్తారా..? లేదా రేపటికి వాయిదా పడుతుందా అనేది ఈ రోజు తేలిపోనుంది..
Read Also: Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సినిమాలో విలన్ గా సీనియర్ హీరో..?
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
మరోవైపు, రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ జైల్లో అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంతో ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రి వద్దకు వైసీపీ వర్గీయులు భారీగా చేరుకున్నారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. అయితే, మల్లవల్లి భూముల్లో తమకు రావాల్సిన పరిహారం వల్లభనేని వంశీ తనకు అనుకూలంగా ఉన్న వారికి ఇప్పించారని వంశీపై కేసు నమోదు చేశారు హనుమాన్ జంక్షన్ పోలీసులు.. అయితే, ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు వల్లభనేని వంశీ.. దీనిపై విచారణ జరిపి ముందస్తు బెయిల్ ఇచ్చింది నూజివీడు కోర్టు. అయితే, వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ వచ్చినా.. ఆయన జైలులోనే గడపాల్సిన పరిస్థితి.. మరికొన్ని కేసుల్లో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. ఆత్కూరులో 8 ఎకరాలు కబ్జా చేశారని వంశీపై కేసు నమోదు చేశారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులోనూ ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!