వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి కోర్టు రిమాండ్ విధించింది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై కేసు నమోదైంది. పోలీసులు పిటీ వారెంట్ దాఖలు చేసి వంశీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 29 వరకు కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారావుకి కూడా రిమాండ్ విధించింది.
Also Read: Nunna Mango Market: వెలవెలబోతున్న నున్న మామిడి మార్కెట్.. ఆందోళనకు గురవుతున్న వ్యాపారాలు!
వల్లభనేని వంశీపై మొత్తం 8 కేసులు ఉండగా.. అందులో ఐదు కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తీర్పు ఇవాళ రానుంది. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసు, తాజాగా నమోదైన మైనింగ్ కేసులో వంశీకి ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న వంశీ కిడ్నాప్ కేసులో అరెస్టు అయ్యారు. ఇప్పటికే 93 రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజా కేసుల్లో బెయిల్ వచ్చే వరకు వంశీకి జైల్లో ఉండక తప్పదు.