వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో ఊరట దక్కింది.. వల్లభనేని వంశీ మోహన్‌కి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.. మల్లవల్లి భూముల్లో తమకు రావాల్సిన పరిహారం వల్లభనేని వంశీ తనకు అనుకూలంగా ఉన్న వారికి ఇప్పించారని వంశీపై కేసు నమోదు చేశారు హనుమాన్ జంక్షన్ పోలీసులు.. అయితే, ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు వల్లభనేని వంశీ.. ఇక, దీనిపై విచారణ జరిపి ముందస్తు బెయిల్ ఇచ్చింది నూజివీడు కోర్టు.
అది ‘‘వక్ఫ్ బిల్లు’’ కాదు, ‘‘వక్ఫ్ విధ్వంస బిల్లు’’.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ బుధవారం పార్లమెంట్ ముందుకు రాబోతోంది. రేపు మధ్యాహ్నం బిల్లును ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే, ఎంపీలు అంతా సభకు హాజరుకావాలని ఎన్డీయే పార్టీలు తమ తమ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మరోవైపు, ఈ బిల్లును అడ్డుకునే దిశగా కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ వంటి ఇండీ కూటమి నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు.…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వల్లభనేని వంశీ రిమాండ్‌ను పొడిగించింది జిల్లా కోర్టు.. ఆత్కురులో 9 ఎకరాలు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని నమోదైన కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం..
కంకిపాడు పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీ విచారణ ముగిసింది. మూడు గంటలపాటు విచారణ సాగింది. వంశీని మూడు గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. విచారణలో స్థల ఆక్రమణ, బెదిరింపులకు సంబంధించిన పలు ప్రశ్నలు వంశీని పోలీసులు అడిగారు. కేసుతో సంబంధమున్న ఇతరుల వివరాలు కూడా ఆరా తీసిన పోలీసులు. విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిమిత్తం కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం పోలీసులు గన్నవరం కోర్టులో వంశీని హాజరు పర్చారు. పోలీసుల…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది.. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్‌ను మరోసారి పొడిగించింది కోర్టు.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి రిమాండ్‌ను ఏప్రిల్ 9వ తేదీ వరకు పొడిగించింది కోర్టు..
వల్లభనేని వంశీ మోహన్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వంశీ.. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. విచారణ వాయిదా పడుతూ వస్తోంది.. అయితే, ఈ కేసులో ఈ రోజు పెద్ద ట్విస్ట్ వచ్చి చేరింది.. వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వద్దని.. వంశీతో తనకి ప్రాణహాని ఉందంటూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సత్యవర్ధన్.. దీంతో, ఈ…
తిరుమల తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న విచారణ. నేడు CVSO శ్రీధర్‌ను విచారించనున్న కమిషన్. 21 నుంచి 3 రోజుల పాటు 42 మంది విజిలెన్స్ సిబ్బంది 32 మంది పోలీసులను విచారించనున్న కమిషన్. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు జారీ. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు తుది విచారణ. SLBC టన్నెల్‌లో 27వ రోజు రెస్క్యూ ఆపరేషన్. గల్లంతైన ఏడుగురి కోసం క్యాడవర్ డాగ్స్‌తో గాలింపు. డీ2, డీ1 ప్రదేశాల్లో మిని జేసీబీలతో తవ్వకాలు. ఆచూకీ…
వల్లభనేని వంశీ మోహన్‌కు మరోషాక్ తగిలింది.. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ.. అయితే, ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కబ్జా కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది గన్నవరం కోర్టు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. గన్నవరం పోలీసులు నమోదు చేసిన మైనింగ్ కేసుల్లో 41ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని రెండు పిటిషన్లు దాఖలు చేశారు వంశీ