వల్లభనేని వంశీని రెండోసారి కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు.. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు తాజాగా పిటిషన్ వేశారు.. ఇప్పటికే ఇదే కేసులో రెండు రోజుల పాటు వల్లభనేని వంశీని న్యాయస్థానం కస్టడీకి ఇచ్చింది.
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు పోలీసులు తీసుకొచ్చారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వంశీకి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తీసుకొచ్చారు. వంశీ పోలీస్ కస్టడీలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ముందుగా కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సోమవారం ఉదయం కంకిపాడు నుంచి గుంటూరు జీజీహెచ్‌లో చేర్చారు. Also Read: Kandula Durgesh: ఏరోజూ సినిమా నిర్మాతల్ని…
అమరావతి : నేడు చెన్నై లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన. ఇప్పటికే చెన్నై చేరుకున్న పవన్. ఉదయం 10 గంటలకు తిరువాన్మియూరు రామచంద్ర కన్వెన్షన్ హాలులో ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’పై సదస్సు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న పవన్ కళ్యాణ్. అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయానికి రానున్న సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పథకాల అమలు…సర్వే రిపోర్ట్ పై సమీక్ష. సాయంత్రం ఆరు గంటలకు సచివాలయం నుంచి నేరుగా కడప…
వల్లభనేని వంశీ రెండు రోజుల కస్టడీ పూర్తి అయింది.. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నమోదైన కేసుకి సంబంధించి వంశీని రెండ్రోజుల పాటు పోలీసులు విచారించారు. వంశీని 30కిపైగా ప్రశ్నలు అడిగారు. నకిలీ ఇళ్ల పట్టాలను ఎక్కడ ఎవరు ఎందుకు తయారు చేసారని వంశీని పోలీసులు ప్రశ్నించారు. నకిలీ ఇళ్ల పట్టాల తయారీలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయాల్ని అడిగారు. తనకు నకిలీ పట్టాలతో సంబంధం లేదని వంశీ సమాధానం చెప్పారు.
పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కంకిపాడు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలుసుకున్న వంశీ సతీమణి పంకజశ్రీ కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని సైతం ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో వంశీకి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కంకిపాడు పోలీస్ కస్టడీ లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే…
త్వరలోనే పెళ్లి.. ఇంతలో దుండగుడి కాల్పుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి ఆ జంట అందమైన జంట. చూడముచ్చటైన జంట. చిలకాగోరింకల్లా ఉన్నారు. వివాహం అనే బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని కలలు కన్నారు. కోరుకున్న చెలిమి దొరికిందని ఎంతగానో మురిసిపోయాడు. జెరూసలేంలో ఆమెకు ప్రపోజ్ చేసేందుకు ఉంగరం కూడా తీసుకున్నాడు. కానీ అంతలోనే మృత్యువు ఎదురొస్తుందని ఊహించలేకపోయాడు. ఓ దుర్మార్గుడు అకస్మాత్తుగా వచ్చి కాల్పులకు తెగబడడంతో అక్కడికక్కడే జంట నేలకొరిగింది. ఈ విషాద ఘటన వాష్టింగ్టన్‌లోని…
నేడు ఏపీ హైకోర్టులో పీఎస్సార్ బెయిల్ పిటిషన్ల విచారణ. నటి జత్వాని కేసు, ఏపీపీఎస్సీ అక్రమాల కేసుల్లో బెయిల్ కోరుతూ పిటిషన్. రెండు బెయిల్ పిటిషన్లపై విచారణ జరపనున్న ఏపీ హైకోర్టు. అంబేద్కర్ కోనసీమ: నేడు అమలాపురంలో పర్యటించనున్న జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. మధ్యాహ్నం అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం.. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా టీడీపీ మిని మహానాడుకు హాజరుకానున్న మంత్రి అచ్చెన్నాయుడు. అమరావతి: మధ్యాహ్నం 12…
నకిలీ పట్టాల పంపిణీ కేసు వ్యవహారంలో వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో విచారణ జరిగింది.. నకిలీ పట్టాల పంపిణీ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కీలక ఆదేశాలు జారీ చేసింది నూజివీడు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు.