దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. రెండు వ్యాక్సిన్లు తీసుకున్నా ఒమిక్రాన్ వేరియంట్ రక్షణ వ్యవస్థను దాటుకొని విజృంభిస్తుండటంతో కొత్త సంవత్సరం వేడుకలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలపై కర్ణాటక సర్కార్ నిషేధం విధించగా, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఢిల్లీ సర్కార్ నిషేధం విధించింది. కాగా, హర్యానా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి జనవరి 1 తరువాత పూర్తి వ్యాక్సిన్ తీసుకోని వారిని రోడ్డు మీదకు రాకుండా కట్టడి…
కరోనా సాధారణ ప్రజల జీవితాలను అస్త్యవస్తం చేసింది. కరోనా వచ్చి ఏడాది అవుతున్నా ఈ మాయాదారి మహమ్మారి ఇప్పటికి తన రూపురేఖలను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా విజృంభిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నా, బూస్టర్ డోసులు వేసుకున్నా ఎవ్వరేమి తక్కువ కాదు నాకు అందరూ ఒక్కటే అంటూ విరుచుకు పడుతుంది. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు లాక్ డౌన్ దిశగా వెళ్లాయి. మరికొన్ని…
ఒమిక్రాన్‌తో దేశం అంతట ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నాయి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం 100శాతం వ్యాక్సినేషన్ అధికారులు ఇవ్వగలిగారు. దీంతో సంపూర్ణ వ్యాక్సినేషన్ సాధించిన ప్రాంతంగా ఈ దీవి రికార్డు సృష్టించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో కొండలు, అడవులు దాటి వెళ్లి వ్యాక్సినేషన్ వేయడమంటే పెద్ద సవాల్‌తో కూడుకున్న పనిగా అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్రపాలిత ప్రాంతంలో అర్హులందరికీ రెండు డోసుల…
వ్యాక్సినేషన్‌లో రాష్ర్టం స్పీడ్ పెంచింది. ఓవైపు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో అందరికి వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ముందుకెళ్తుంది.ఈ నెల 22లోగా కరోనా తొలిడోసు వ్యాక్సినేషన్‌ను 100శాతం పూర్తి చేయాలని రాష్ర్ట ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అన్ని జిల్లాలు కలిపి 98శాతం మందికి తొలిడోసు ఇవ్వగా..16 జిల్లాల్లో 100శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. 3 జిల్లాల్లో 99 శాతం వ్యాక్సినేషన్, 8 జిల్లాలో90 శాతానికి పైగా, 6 జిల్లాలో 90శాతం లోపు వ్యాక్సినేషన్ జరిగింది.…
వ్యాక్సిన్ పై ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేయించుకుంటే ఆరోగ్యం చెడిపోతుందని, పిల్లలు పుట్టరనే అపోహలు చాలా మందిలో ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో అంటే సరిలే అనుకోవచ్చు. కానీ, అభివృద్ది చెందిన ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి సందేహిస్తున్నారు. లండన్‌లో కరోనా, ఒమిక్రాన్ కేసులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. Read: తెలంగాణలో మొత్తం 20 ఒమిక్రాన్ కేసులు నమోదు ప్రస్తుతం లండన్‌లో ఇంగ్లీష్ ప్రీమియం ఫుట్‌బాల్ లీగ్…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. వేగంగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేశారు. కరోనాకు పుట్టినిల్లైన చైనాలో ఎన్నో రకాల వ్యాక్సిన్ల అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్ల పనితీరుపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత మొదలైంది. దీనికి కారణం హాంకాంగ్ శాస్త్రవేత్తలు అందించిన సర్వే అని చెప్పవచ్చు. చైనాకు చెందిన సీనోఫామ్ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి చేసింది. కోట్లాది మంది ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. …
తెలంగాణలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నామన్నారు వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు. 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్దం చేయాలని ఆదేశించారు. ప్రపంచ వ్యాప్త కరోనా పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సౌకర్యం సిద్దం చేయాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలి, రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలని హరీష్ రావు సూచించారు. కరోనా తాజా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు.…
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అని ప్రజలు భయపడిపోతున్నారు. యూరప్ దేశాల్లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. అలానే, ఆఫ్రికా దేశాల్లో ఒమిక్రాన్ కేసులు అధికమవుతున్నాయి. ఆసియా దేశాల్లోనూ ఇంచుమించు ఇదేవిధమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటు వస్తున్న న్యూజిలాండ్ దేశంలోనూ కరోనా భయం పట్టుకుంది. కేసులు పెరుగుతున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌ను వేగం చేశారు. Read: ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధి ఇదే……
ప్రపంచం మొత్తంమీద ప్రస్తుతం కరోనాతో అత్యంత ఇబ్బందులు పడుతున్న దేశం ఏంటని అంటే బ్రిటన్ అని టక్కున చెప్పేస్తున్నారు. సౌతాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్ వేరియంట్‌లు ఇప్పుడు అత్యధికంగా బ్రిటన్‌లోనే కనిపిస్తున్నాయి. రోజుకు వందల సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశం అప్రమత్తం అయింది. గతంలో విధించిన లాక్‌డౌన్ ల దెబ్బకు ఆర్థికంగా కుదేలైంది. ప్రజలను మహమ్మారుల నుంచి బయటపడేసేందుకు ప్రస్తుతం ఆంక్షలు అమలు చేస్తున్నది. Read: యూరప్‌ను వణికిస్తున్న ఒమిక్రాన్… ఫ్రాన్స్‌లో…