ఒమిక్రాన్ పై డబుల్ మాస్క్‌లతో యుద్ధం చేయాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సాధారణ ప్రజల జీవితాలను అస్త్యవస్తం చేసింది. కరోనా వచ్చి ఏడాది అవుతున్నా ఈ మాయాదారి మహమ్మారి ఇప్పటికి తన రూపురేఖలను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా విజృంభిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నా, బూస్టర్ డోసులు వేసుకున్నా ఎవ్వరేమి తక్కువ కాదు నాకు అందరూ ఒక్కటే అంటూ విరుచుకు పడుతుంది. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు లాక్ డౌన్ దిశగా వెళ్లాయి. మరికొన్ని దేశాలు దీన్ని ఎదుర్కొవడానికి కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నాయి. ఏది ఏమైనా ప్రజలు సాధారణ జీవితాన్ని ఇప్పట్లో చూడటం కష్టమనే చెప్పాలి. దీంతో మరోసారి ఈ మహమ్మారిని ఎదుర్కొవడానికి మాస్క్‌ల ఆవశ్యకతపై చర్చ మొదలైంది. ఏది మంచింది. అనే అనుమానాలు ప్రజల్లో మొదలయ్యాయి.
కోవిడ్ -19, ఒమిక్రాన్ వేరియంట్, డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్న ఈ వ్యాధుల నుంచి బయటపడేందుకు ప్రాథమిక రక్షణగా మాస్క్‌లు పనిచేస్తాయని డాక్టర్ల నమ్మకం కానీ, వీటి సామర్థ్యం పై ప్రజల్లో చాలా అను మానాలు ఉన్నాయి. ఎంతవరకు ఇవి రక్షణను ఇస్తాయనేదే ప్రశ్న. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ , వ్యాధి నియంత్రణ కేంద్రాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహా పలు ఆరోగ్య సంరక్షణ సంస్థలు మాస్క్‌లను ఖచ్చితంగా ధరించాల్సిందేనని ఇప్పటికే చెప్పాయి. ప్రజలు టీకాలు వేసుకున్నారా లేదా అన్న దానితో సంబంధం లేకుండా మాస్క్‌లు వాడాల్సిందేనని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి.
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!

డబుల్ లేయర్ మాస్క్‌లను ధరించాల్సిందే..
సింగిల్-లేయర్ క్లాత్ మాస్క్‌లు, సర్జికల్ మాస్క్‌ల నుంచి ప్రజలు డబుల్ లేయర్ మాస్క్‌లు లేదా N95 మాస్క్‌లకు అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థలు తరుచుగా చెబుతునే ఉన్నాయి. మాస్క్‌లతో పూర్తి రక్షణ కాకున్నా ఈ కరోనా వేరియంట్‌ను ఎదుర్కొవడంలో ప్రాథమికంగా రక్షణ కల్పిస్తాయి. అంతే కాకుండా మాస్క్‌లను సరిగ్గా ధరిస్తే అవి ప్రజలు పీల్చే గాలి నుంచి వైరస్ కణాలు ఫిల్టర్ చేయడం ద్వారా వ్యక్తులకు రక్షణను కల్పిస్తాయని ఆయా సంస్థలు పేర్కొన్నాయి.
ఎంత వరకు రక్షణ..?
ఈ డబుల్ లేయర్ మాస్క్‌లతో ఎంత వరకు రక్షణ ఉంటుందని ప్రజలు పలు అనుమానాలను లేవనేత్తుతున్నారు. అయితే ఆరోగ్య నిపుణలు మాత్రం ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు, ఇన్ఫెక్షన్ దరి చేరకుండా N95 మాస్క్‌లు కాపాడుతాయని ఆరోగ్య సంస్థలు పేర్కొంటున్నాయి. రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు N95 మాస్క్‌లను ధరించినప్పుడు, 1000 మంది వ్యక్తులలో 10 మందికి ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ, సాధారణ సర్జికల్ మాస్క్‌తో పోల్చినప్పుడు ఇన్‌ఫెక్షన్ రిస్క్ 1,000 మందిలో ఒక్కరికే ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఖరీదైన N95 మాస్క్‌లను కొనుగోలు చేయలేని వారు ప్రత్యామ్నాయంగా రెండు-లేయర్డ్ డబుల్ మాస్క్‌లను ధరించాలని సూచిస్తున్నారు. ఇది ఎక్స్‌పోజర్‌ను నిరోధించడానికి కూడా సమర్థవంతమైన మార్గంగా పని చేస్తుంది. ఇది కూడా కుదరకపోతే ప్రజలు సర్జికల్ మాస్క్‌పై సాధారణ క్లాత్ మాస్క్‌ను ధరించడం ఉత్తమమైన పనిగా నిపుణులు పేర్కొంటున్నారు.
Read Also:
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!