కోవిడ్, వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జనవరిలోగా అందరికీ డబుల్ డోస్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడమే కోవిడ్ నివారణలో ఉన్న పరిష్కారమని.. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. ఆరోగ్య శ్రీ సేవలు ఏ ఆస్పత్రిలో దొరుకుతాయనే విషయం అందరికీ అవాగాహన కల్పించాలని… గ్రామ సచివాలయాల్లో సంబంధించిన హోర్డింగ్స్ పెట్టాలని వెల్లడించారు. విలేజ్…
భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న సంగతి తెల్సిందే. వ్యాక్సినేషన్‌లో భారత్ ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలో సగానికి పైగా మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ను అందజేశారు. IANS-Cvoter కోవిడ్ వ్యాక్సిన్ ట్రాకర్ సర్వే ప్రకారం.. జనాభాలో 98శాతం కంటే ఎక్కువ మంది కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయించుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తేలింది. దేశంలోని 90 కోట్ల మంది వయోజన జనాభాలో 81 కోట్ల మందికి పైగా ప్రజలు కోవిడ్ 19…
సౌతాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తూనే ఉంది.. దీంతో.. కొత్త వేరియంట్‌పై కూడా రకరకాల పరిశోధనలు మొదలయ్యాయి.. ఒమిక్రాన్‌పై ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ప్రభావం ఎంత? అనే దానిపై కూడా ఫోకస్ పెట్టారు.. అయితే, దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కీలక ప్రకటన చేసింది.. కరోనా వ్యాక్సిన్ సామర్థ్యాన్ని ఒమిక్రాన్ తగ్గిస్తుందని హెచ్చరించింది డబ్ల్యూహెచ్‌వో.. ఇక, ఒమిక్రాన్‌కు డెల్టా కంటే వేగంగా వ్యాప్తించే గుణం ఉందని…
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇండియా అలర్ట్ అయింది. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్‌ను వేగం చేసింది. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇండియాలోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. రోజుకు సగటున 50 లక్షలకు పైగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రయ మందకోడిగా సాగింది. ఎప్పుడైతే ఒమిక్రాన్ వేరియంట్‌ను వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించిందో అప్పటి నుంచి వ్యాక్సినేషన్‌ను మరింత వేగంవంతం చేశారు. Read:…
ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న ఓమిక్రాన్ వేరింయట్ తాజగా దేశంలో కూడా వ్యాప్తి చెందడంతో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమైంది. దీంతో కరోనాకు సంబంధించిన అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు కేజ్రివాల్ సర్కార్ సిద్ధమైంది. 30,000 కంటే ఎక్కువ కోవిడ్ పడకలు, ఆక్సిజన్ సరఫరాను పెంచడంతో ఓమిక్రాన్ ఎదుర్కొంటామన్నారు. 442 MT ఆక్సిజన్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, 21 MT ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచినట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా ఈ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు ప్రభుత్వాలు వినూత్నంగా ఆలోచిస్తున్నాయి. బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదం పొంచియున్న నేపథ్యంలో 100 శాతం వ్యాక్సినేషన్‌ను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వాలు సన్నద్ధం అవుతున్నాయి. Read: వంశీ నోరు అదుపులో పెట్టుకోవాలి… టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్… గుజరాత్ లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ వినూత్నంగా…
తెలంగాణ కేబినేట్ భేటిలో చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్ మంత్రులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. ఐదు గంటల పాటు కేబినేట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సన్నద్ధంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. కరోనా పరీక్షలు పెంచాలని నిర్ణయం. మందులు, వ్యాక్సిన్‌లు సమకూర్చుకోవాలని ఆదేశం. ఇప్పటికే ఒమిక్రాన్ పై మంత్రి హరీష్ రావు అధ్యక్షతన సబ్‌కమిటీని వేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంవంతం చేయాలని సూచించారు. వైద్యాఆరోగ్య శాఖతో…
ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లిన ఇద్దరు విదేశీ ప్రయాణికులకు కరోనావైరస్ పరీక్షలు చేశారు. కాగా వారికి కొత్త ఓమిక్రాన్ వేరియంట్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆస్ట్రేలియా అధికారులు ఆదివారం ధృవీకరించారు. శనివారం దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియాకు వచ్చిన మరో 14 మంది బృందంలో ఈ ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. వారికి కోవిడ్ -19 టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు. కాగా మిగిలిన 12 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. కొత్త…
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ ‘ఒమిక్రాన్’ ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఆఫ్రికాలోని పలు దేశాలకు ఇప్పటికే విస్తరించిన ఈ వేరియంట్.. క్రమంగా మిగతా చోట్లకు విస్తరిస్తోంది. తాజాగా జర్మనీలో ఒకరు ఒమిక్రాన్ బారిన పడగా.. బ్రిటన్‌లో రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి. B.1.1529 వేరియంట్ బోట్స్‌వానా, బెల్జియం, ఇజ్రాయెల్, హాంకాంగ్‌లకు వ్యాపించింది. ఒమిక్రాన్ వైరస్ కొన్ని దేశాల్లో మాత్రమే వ్యాపిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈమేరకు ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. ఒమిక్రాన్ వైరస్‌తో అప్రమత్తంగా…