ఒమిక్రాన్‌తో దేశం అంతట ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నాయి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం 100శాతం వ్యాక్సినేషన్ అధికారులు ఇవ్వగలిగారు. దీంతో సంపూర్ణ వ్యాక్సినేషన్ సాధించిన ప్రాంతంగా ఈ దీవి రికార్డు సృష్టించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో కొండలు, అడవులు దాటి వెళ్లి వ్యాక్సినేషన్ వేయడమంటే పెద్ద సవాల్‌తో కూడుకున్న పనిగా అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్రపాలిత ప్రాంతంలో అర్హులందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ అందజేసినట్లు అక్కడి పాలక వర్గం ప్రకటించింది.
దీంతో కొవిషీల్డ్ టీకాతో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న తొలి రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతంగా అండమాన్ నికోబార్ నిలిచింది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 800 కి.మీ విస్తీర్ణంలో ఉన్న 836 దీవులకు చేరుకొని వ్యాక్సిన్లు అందజేశామని ప్రతికూల వాతావరణంలోనూ టీకాలు అందజేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన జనవరి 16నే ఈ దీవుల్లో కూడా టీకాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం అండమాన్ నికోబార్ దీవుల్లో మొత్తం 2.87 లక్షల మంది అర్హులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ దీవుల్లో మొత్తం జనాభాలో 74.67 శాతం మంది టీకాలు అందినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: