ఆఫ్రికాలోని బోట్స్‌వానాలో మొదటి ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఈ వేరియంట్ క్రమంగా ప్రపంచంలోని దాదాపు అన్నిదేశాలకు వ్యాపించింది. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లో ఈ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగానే ఉన్నది. మరణాల సంఖ్య సైతం తక్కువగా ఉండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పలు దేశాల్లో వివిధ వేవ్‌లకు ఒమిక్రాన్ కారణమైంది. తీవ్రత తక్కువగా ఉండటానికి గల కారణాలను పరిశోధకులు పరిశోధించారు. డెల్టా వేరియంట్…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా కేరళ రాష్ట్రంలో కేసులు భారీ సంఖ్యలో నమోదువుతున్నాయి. కేరళ రాష్ట్రంలో 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 51,887 కరోనా కేసులు నమోదైనట్టు కేరళ ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 1205 మంది మృతి చెందారు. కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరగడంతో రాష్ట్రప్రభుత్వం అలర్ట్ అయింది. కేరళలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు మరింత కఠినంగా నిబంధనలు అమలుచేసేందుకు సిద్దమవుతున్నారు. Read: నావికా…
తెలంగాణలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. థర్డ్ వేవ్ కారణంగా 60 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసులు అందిస్తున్నారు. అయితే, 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లాలి అంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అంతదూరం వెళ్లి క్యూలైన్లో నిలబడి వ్యాక్సిన్ తీసుకోవాలంటే అయ్యేపనికాదు. వీరికోసం జీహెచ్ఎంసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే డైరెక్ట్‌గా వారి ఇంటికి వచ్చి బూస్టర్ డోసు…
గత రెండేళ్లుగా దేశం కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్నది. కరోనా నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. వేగంగా వ్యాక్సిన్‌ను అమలు చేస్తున్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, వ్యాక్సినేషన్ తీసుకోవాలని ప్రభుత్వాలు గట్టిగా చెబుతున్నాయి. కానీ, చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. తమిళనాడులో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంలో నైట్ కర్ఫ్యూతో పాటు వీకెంట్ లాక్‌డౌన్ ను అమలు చేస్తున్నాయి. మందుబాబులు వ్యాక్సిన్ విషయంలో నిబంధనలను పక్కన పెట్టేస్తున్నారు.…
ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాత కరోనా థర్డ్ వేవ్ భారత్‌లో కోవిఢ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగూ ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా.. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల ఆరోగ్యశాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు..…
యూపీలో ఫిబ్రవరి నుంచి ఎన్నికలు జరగబోతున్నాయి. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడు విడతల ఎన్నికల కోసం యూపీ అధికారులు సిద్దం అవుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం అధికారులు పల్లె ప్రాంతాలకు వెళ్లి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, బలియా జిల్లాలో అత్యల్పంగా వ్యాక్సినేషన్ జరిగింది. అక్కడి ప్రజలు వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి ససేమిరా అంటున్నారు. దీంతో అధికారులు బతిమాలి, వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే,…
కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు టీకాలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున టీకాలు అందిస్తున్నారు. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో టీకాలు అందిస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్, హెల్త్‌కేర్ వర్కర్లు, కరోనా వారియర్స్‌కు టీకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు అత్యవసర వినియోగం కింద అనుమతులు పొందిన కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు త్వరలో బహిరంగ మార్కెట్లోకి రాబోతున్నాయి. కోవీషీల్డ్, కోవాగ్జిన్ తయారీ సంస్థలు బహిరంగ…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ తప్పనిసరి అయిపోయింది.. దీంతో, క్రమంగా అన్ని ఏజ్ గ్రూపులకు వ్యాక్సిన్ వేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది భారత ప్రభుత్వం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కూడా కరోనా టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే కాగా.. త్వరలోనే 15 ఏళ్ల లోపు వారికి కూడా టీకాలు వేసేందుకు సిద్ధం అవుతోంది.. ఇవాళ వ్యాక్సినేషన్‌పై మాట్లాడిన జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ ఎన్‌కే అరోరా… త్వరలోనే…
పట్నం నుంచి పల్లె వరకు.. సిటీ నుంచి మారు మూల గ్రామం వరకు.. అన్ని ప్రాంతాలను టచ్ చేస్తూనే ఉంది కరోనా మహమ్మారి.. దీనికి చెక్ పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతోంది.. మొదట స్వదేశీ వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చిన భారత ప్రభుత్వం.. 2021 జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది.. ఇదే సమయంలో.. ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్లు ఎగుమతి చేసింది.. ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు…