కోవిడ్ వ్యాక్సినేషన్‌లో తెలంగాణ మరో మైలురాయిని దాటింది. రాష్ట్రంలో కొవిడ్ టీకాల పంపిణీ 5 కోట్ల డోసులు పూర్తయింది. వైద్యసిబ్బంది కేవలం 35 రోజుల్లోనే కోటి టీకాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో గురువారం నాటికి మొదటి డోస్ 2.93 కోట్లు, రెండో డోస్ 2.06 కోట్లు, ప్రికాషన్ డోస్ మరియు బూస్టర్ డోస్ 1.13 లక్షల డోసులు పంపిణీ చేశారు. 15-17 ఏళ్ల వారికి 8.67 లక్షల డోసులు (47%) వేశారు. మొదటిడోస్ లక్ష్యానికి మించి దాదాపు…
కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరిగిపోతున్నది. అనేక రకాల వేరియంట్లు భయాందోళనలు కలిగిస్తున్నాయి. దీని నుంచి రక్షణ పొందేందుకు ప్రస్తుతం కొన్ని రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అన్ని రకాల వైరస్ వేరియంట్ల నుంచి రక్షణ పొందేందుకు ఒకటే టీకాను తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా శరీరంలో టి కణాల ఉత్పత్తి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. అయితే, టి కణాల ఉత్పత్తి పెంచడం అన్ని ఒమిక్రాన్ తో సహా అన్ని…
దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ప్రికాషనరీ డోస్ కింద వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. మొదటి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో, మూడో డోస్ కింద అదే వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. మొదటగా 60 ఏళ్లు దాటిన వారికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, హెల్త్ వర్కర్లకు ఈ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 5.75 కోట్ల మంది మూడో డోస్ వ్యాక్సిన్‌కు అర్హులని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇందులో 2.75 కోట్ల మంది 60 ఏళ్లు పైబడిన…
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో వ్యాక్సిన్‌ను వేగంగా అందిస్తున్నారు. అర్హతకలిగిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశంలో 80 శాతం మంది వరకు మొదటి డోసు తీసుకున్నారు. 60 శాతానికిపైగా ప్రజలు రెండో డోసు తీసుకున్నారు. మిగిలిన వారు కూడా వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 11 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాడు. 12…
దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తుండటంతో కీలక బెంగళూరు నగరపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మాల్స్, థియేటర్లలో ప్రవేశానికి రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఇదే విధానాన్ని పబ్‌లు, రెస్టారెంట్‌లతో పాటుగా క్యాబ్‌లకు కూడా విస్తరింపజేయాలని బెంగళూరు నగరపాలక సంస్థ చూస్తున్నది. రాబోయే రోజుల్లో కేసులు భారీగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోనున్నది. ప్రస్తుతం అందరివద్ద స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. Read: కరోనా వేళ…
కరోనా సమయంలో భారత్ అనేక దేశాలకు మానవతా దృక్పదంలో సహాయం చేసింది. అమెరికాతో సహా అనేక దేశాలకు మందులను సప్లై చేసింది. కోవిడ్ మొదటి దశలో ఇండియా నుంచి మలేరియా మెడిసిన్‌ను వివిధ దేశాలకు ఉచితంగా సప్లై చేసింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను తయారు చేసిన తరువాత కూడా ఇండియా మిత్ర దేశాలకు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను మానతవతా దృక్పధంలో అందించింది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌కు 5 లక్షల కోవాగ్జిన్ డోసులను సరఫరా చేసింది.…
భారత్‌లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో పాటుగా, థర్డ్ వేవ్ ముప్పు పొంచియున్న నేపథ్యంలో బూస్టర్ డోసులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. జనవరి 10 వ తేదీ నుంచి 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసులు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, బూస్టర్ డోసులుగా ఏ వ్యాక్సిన్‌ను ఇవ్వబోతున్నారు అన్నదానిపై కేంద్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మక్సింగ్, మ్యాచింగ్ పద్ధతిలో డోస్ ఉంటుందా లేదంటే గతంలో ఇచ్చిన కోవాగ్జిన్ లేదా కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను ప్రికాషన్ డోస్‌గా ఇస్తారా…
దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఏడాది జనవరి 10 వ తేదీ నుంచి 60 ఏళ్లుదాటిన వృద్దులకు బూస్టర్ డోసులు అందించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. బూస్టర్ డోసులపై తాను ఇచ్చిన సలహాను కేంద్రం స్వీకరించిందని, ఇది మంచి నిర్ణయమని అన్నారు. బూస్టర్ డోసుల రక్షణ ప్రతి ఒక్కరికి చేరాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. …
కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 15-18 ఏళ్ళ వారికి వ్యాక్సిన్ కొనసాగుతుందన్నారు మోడీ. జాతి నుద్దేశించి ప్రధాని మోడీ ఇవాళ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఒమిక్రాన్ వ్యాపిస్తోందని… ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లల కోసం బెడ్స్ సిద్ధంగా వున్నాయని… కరోనాను మనం సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. మనం వ్యాక్సిన్ల విషయంలో అందరికంటే ముందున్నాని…