కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. కోరలు చాస్తూనే ఉన్నది. అమెరికాతో పాటుగా అటు ఆస్ట్రేలియాలో కూడా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో పెరిగిపోతుండటంతో వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. విక్టోరియా, న్యూసౌత్‌వేల్స్‌లో కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేశారు. నిర్మాణ కార్మికులు కనీసం ఒక్క డోసు తప్పనిసరిగా తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్న వారినే నిర్మాణ పనులకు హాజరుకావాలని ఆదేశించింది. దీనిని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. వందలాది మంది నిర్మాణకార్మికులు మెల్‌బోర్న్ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు. ఈ నిరసనల కార్యక్రమం ఉధ్రిక్తతలకు దారితీసింది. పోలీసులకు, కార్మికులకు మధ్య రగడ జరిగింది. వందలాది మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనేక ప్రాపర్టీస్ దెబ్బతినడంతో రెండు వారాలపాటు నిర్మాణ పనులను సీజ్ చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
Read: మళ్లీ పట్టు సాధించిన పుతిన్ వర్గం: ఎన్నికల్లో ఆ పార్టీదే ఘనవిజయం…