వ్యాక్సినేషన్.. భారత్‌లో త్వరలోనే ఆ వ్యాక్సిన్ తొలిడోసు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పటికే భారత్‌లో వ్యాక్సినేషన్ ఊపందుకుంది.. ఒకప్పుడు రోజుకు లక్షల్లో డోసులు వేసే స్థాయి నుంచి ఇప్పుడు ఒకేరోజులో రెండు కోట్లకుపైగా వ్యాక్సిన్లు వేసి రికార్డు సృష్టించింది భారత్.. ఇక, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అర్హులైన జనాభా అంతటికీ కనీసం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు అందించాలనే లక్ష్యం నెరవేరేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. అందులో భాగంగా.. మరో విదేశీ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది.. అక్టోబర్ నుంచి భారత్‌కు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ తొలి డోసుల సరఫరా ప్రారంభం కానుంది. మొదటి విడతలో 4.35 కోట్ల డోసులు భారత్‌కు చేసుకుంటాయని తెలుస్తోంది. ఇక, అక్టోబర్ నెలలోనే 30 కోట్ల టీకా డోసుల పంపిణీ చేపట్టాలన్న భారత్ టార్గెట్‌కు ఇది మరింత దోహదపడుతుందని చెబుతున్నారు. కాగా, మొదటల్లో ఓసారి దరఖాస్తు చేసి వెనక్కి వెళ్లిపోయిన జాన్సన్ అండ్ జాన్సన్.. మరోసార దరఖాస్తు చేసుకోవడం.. దానికి భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిన సంగతి తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!