రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.. కరోనా టెస్ట్‌లతో పాటు.. వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ సర్కార్‌కు ఆదేశాలిచ్చింది.. కరోనా పరిస్థితులపై ఇవాళ విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు.. వ్యాక్సినేషన్ 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.. ఇక, విద్యాసంస్థల్లో సిబ్బందికి 2 నెలల్లో వ్యాక్సిన్ పూర్తిచేయాలని స్పష్టం చేసింది ధర్మాసనం.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు సైతం పెంచాలని ఆదేశాలు జారీచేసింది. కాగా, రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది.. ఒక్కోరోజు కనీసం 3 లక్షల డోసులకు తగ్గకుండా వేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.. తాజాగా, గ్రామాలు, వార్డుల్లో సైతం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ క్యాంపులు పెట్టి వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది సర్కార్.