ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఈ సమావేశం నిర్వహించారు. కాగా, వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని మోడీ ఆదేశించారు.. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని సూచనలు చేశారు. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోన్న.. మోడీ మరోసారి అధికారులను అలర్ట్ చేశారు. దేశంలో ఇంకా పూర్తిగా సెకండ్ వేవ్ కూడా ముగియలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ నిన్న…
దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలుచేస్తున్నారు. ప్రతిరోజూ కోటి మంది వరకు టీకాలు తీసుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యాసంస్థలను ఒపెన్ చేశారు. అర్హులైన ప్రతి విద్యార్ధి, ఉపాద్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ టీకాలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానోపాద్యాయులు, పీహెచ్‌సీలు సమన్వయంతో టీకాలు వేయాలని, ఈ విషయంలో కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్ 10 వ తేదీలోగా విద్యాసంస్థల్లో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తికావాలని ఆదేశించింది.…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 313 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,58,689కి చేరింది. ఇందులో 6,49,002 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,809 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 3,878 కి చేరింది. ఇక తెలంగాణలో వేగంగా…
దేశంలో వేగంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. గత రెండు మూడు రోజులుగా రోజుకు కోటి వరకు వ్యాక్సినేషన్లను అందిస్తున్నారు. ఆర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. దేశంలో వ్యాక్సిన్ కొరత లేదని, అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్లను అందిస్తున్నామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దేశంలో 66…
దేశంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటంతో అన్ని రకాల కరోనా వైరస్‌లను తట్టుకునే విధంగా ఒక శక్తివంతమైన వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ పిలుపునిచ్చింది. ప్రపంచ దేశాలు ఈ విషయంలో ఒక్కటి కావాలని, అన్ని రకాల వైరస్‌లను తట్టుకునే విధంగా వ్యాక్సిన్‌లను తయారు చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ఈ తరహా వ్యాక్సిన్ అభివృద్ధికి ప్రపంచ దేశాలు సహకరించాలని, అభివృద్ది…
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది.. కరోనా వైరస్‌తో కొన్ని దేశాల్లో కొత్త వేరియంట్లు వెలుగు చూస్తూ ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు ఎప్పుడు కలవరపెడుతున్న వేరియంట్ మాత్రం.. డెల్టా వేరియంట్.. ఆ తర్వాత డెల్టా ప్లస్ వేరియంట్ కూడా బయటపడగా.. అయితే ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే.. డెల్టా వేరియంట్ సోకిన రోగులు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చే ముప్పు రెండు రెట్లు అధికమని ఓ అధ్యయనం తేల్చింది.. డెల్టా వేరియంట్ ప్రభావం, దాని నుంచి…
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఇదొక్కటే మార్గం. అందుకే ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాక్సినేషన్ ను కొనసాగిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌లైన్స సంస్థ వ్యాక్సిన్ పై కీలక నిర్ణయం తీసుకున్నది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఇప్పటికే ఆ కంపెనీ ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా అమలు చేసింది. అయితే, కొంతమంది…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ దేశంలో 60 లక్షల మందికి పైగా టీకాలు తీసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టింది. ఈ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా 24 గంటల వ్యవధిలో 24.20 లక్షల మందికి వ్యాక్సిన్‌ను అందించింది. అంటే గంటకు లక్ష మందికి వ్యాక్సిన్ అందించింది. 24 గంటల వ్యవధిలో 24.20 లక్షల మందికి టీకాలు అందించి రికార్డ్ సృష్టించింది. గతంలో…
కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు 60 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా కార్యక్రమంలో వేగం పెరగడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. చాలా రాష్ట్రాలు స్కూళ్లు తెరిచేందుకు నిర్ణయం తీసుకున్న వేళ.. కీలక సూచనలు చేసింది. సెప్టెంబర్ 5లోగా వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలకు అదనంగా 2 కోట్ల డోసులు పంపినట్లు తెలిపింది. టీచర్స్ డే కంటే ముందుగానే లక్ష్యాన్ని పూర్తి…