కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారికి…వైరస్ సోకుతోంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా.. ఇక నిశ్చితంగా ఉండొచ్చన్న భావన వీడాలని నిపుణులు సూచిస్తున్నారు. సింగపూర్‌లో 84 శాతం ప్రజలు రెండు డోసులు తీసుకున్నప్పటికీ…రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయ్. ఇందులో 14శాతం మంది బూస్టర్ టీకాలు కూడా వేయించుకున్నారు. ఊహించని విధంగా కేసులు నమోదవుతుండటంతో…ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
కొత్తగా నాలుగువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 16 మంది కొవిడ్‌తో మృత్యువాత పడ్డారు. చనిపోయినవాళ్లలో 44 నుంచి 90ఏళ్ల మధ్య వయసు వారే ఎక్కువున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి నూటికి నూరుశాతం జనాభాకు టీకాలు వేయించడానికి సింగపూర్ ప్రభుత్వం అలుపెరుగకుండా శ్రమిస్తోంది.తాజాగా లెట్స్ గెట్ అవర్ సీనియర్స్ వ్యాక్సినేటెడ్ ప్రోగ్రామ్ చేపట్టింది. టీకా తీసుకోని వారి వివరాలు చెప్పినవారికి 30 సింగపూర్ డాలర్ల విలువచేసే వోచర్‌ని పారితోషికంగా ఇస్తోంది. కఠిన నిబంధనలు తీసుకొచ్చే ఆలోచనలో ఉంది సింగపూర్ సర్కార్. దీంతో దీపావళి అమ్మకాలు పడిపోతాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నాలుగు లక్షలమంది దాకా భారత సంతతి జనాభా నివసించడమే కారణంగా తెలుస్తోంది.