ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ విజయ వంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఏకైక మార్గం.. వ్యాక్సినేషన్ కాబట్టి… అన్ని ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ విజయ వంతంగా అమలు చేస్తున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ.. కరోనా వ్యాక్సినేషన్ విజయం వంతంగా ముందుకు సాగుతోంది.
దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 65 శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నేడు కరోనా వ్యాక్సినేషన్ బంద్ కానుంది. దీపావళి పండుగ సందర్భంగా టీకాల పంపిణీకి విరామం ప్రకటించారు. రేపట్నుంచి యథావిధిగానే వ్యాక్సినేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.