ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. రాష్ట్రంలో కరోనా రోజువారి కేసుల సంఖ్య ఓసారి కిందకు.. మరోసారి పైకి కదులుతూనే ఉంది.. అయితే, కరోనాపై పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించిన సీఎం వైఎస్ జగన్.. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. అధికారులను అప్రమత్తం చేస్తూ.. తగిన ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతం కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారిలో 55.13 శాతం మందికి రెండు డోసుల టీకా వేసినట్టు అధికారులు చెబుతున్నారు.. 18 ఏళ్లు పైబడిన వారు 3,95,22,000 మంది ఉండగా.. అందులో 2,17,88,482 మందికి రెండు డోసుల టీకా వేశామమని.. 18 ఏళ్లు పైబడిన వారిలో 84.91 శాతం అంటే.. 3,35,59,940 మందికి రెండో డోసు కూడా వేయించుకున్న వారితో కలిపి తొలి డోసు పూర్తి అయినట్టు చెబుతున్నారు.. ఇక, రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,53,48,422 డోసుల టీకాలను పంపిణీ చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
Read Also: నెల్లూరులో తీరం దాటనున్న తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు..!
ఇక, వ్యాక్సినేషన్ పరిస్థితిని జిల్లాలో పరిశీలిస్తే.. 18 ఏళ్లు పైబడిన వారికి అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 63.02 శాతం మందికి వ్యాక్సిన్ వేయగా.. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 46.58 శాతం, శ్రీకాకుళంలో 47.80 శాతం మందికి టీకా పూర్తిచేసినట్టు వెల్లడించారు అధికారులు.. మిగతా జిల్లాల్లో 18 ఏళ్లు దాటిన 50 శాతానికి పైగా ప్రజలకు రెండు డోసుల టీకాలు వేశారు.. మరోవైపు.. కరోనా బాధితుల్లో రికవరీ రేటు క్రమంగా పెరుగూత వస్తోంది.. నిన్నటి కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,68,718కు చేరగా.. ఇప్పటి వరకు 20,51,082 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.