కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతున్నది. 12 ఏళ్లకు పైబడిన వారికి అక్కడ వ్యాక్సిన్ ఇప్పటికే అందిస్తున్నారు. కాగా 5-11 ఏళ్ల వయసున్న చిన్నారులకు వ్యాక్సిన్ అందించబోతున్నారు. ఫైజర్ ఎన్ బయోటెక్ సంస్థ తయారు చేసిన చిన్నారుల ఫైజర్ టీకాకు ఎఫ్‌డీఎ అనుమతులు మంజూరు చేసింది.
Read: వైరల్: మృగాడి నుంచి కుక్కను కాపాడిన గోమాత…
దీంతో ఈ వ్యాక్సిన్‌ను చిన్నారులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. నవంబర్ 8 నుంచి ఈ వ్యాక్సిన్‌ను వేగంగా అందించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. 2.8 కోట్ల మంది చిన్నారులకు వ్యాక్సిన్‌ను అందించబోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. మహమ్మారిని అడ్డుకోవాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.