కరోనా మహమ్మారితో ఒక్కసారిగా ప్రపంచం అంతా కుదేలయింది. అనంతర కాలంలోనే ఆయా ఫార్మా కంపెనీలు కరోనా నివారణకు టీకాలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇంకా కొన్ని పరీక్షలు వాటికి సంబంధించిన ఇతర అనుమతులకు సిద్ధంగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా జైడస్ కంపెనీ తయారు చేసిన జైకొవ్-డి- వ్యాక్సిన్ రూ.265 కే అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ప్రజలకు వ్యాక్సిన్‌ను మరింత దగ్గర చేసేలా ఆ కంపెనీ చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది.
ఇప్పటికే మన దేశంలో సీరం ఇన్‌స్ట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కంపెనీతయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. అయితే వీటితో పాటు స్పూత్నిక్ వి కూడా అందుబాటులో ఉంది. జైడస్ కంపెనీ వ్యాక్సిన్ ధర తగ్గించాలన్న ప్రభుత్వ డిమాండ్‌కు అంగీకరించినట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. జైడస్ వ్యాక్సిన్ మరో ప్రత్యేకతతో వస్తోంది. సూది లేకుండానే ఇంజెక్టర్ సాయంతో జైకొవ్-డి-వ్యాక్సిన్ ఇస్తారు. ఈ ఇంజెక్టర్ ధర రూ.93కాగా..దాంతో కలిపి వ్యాక్సిన్ మొత్తం ధర రూ.358కి అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఆ సంస్థ కసరత్తు చేస్తోందని సమాచారం.