Mulayam Singh Yadav Health: సమాజ్‌వాదీ పార్టీ అధినేత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడలేదు. ములాయం ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. లైఫ్ సేవింగ్ మెడికేషన్ కొనసాగుతున్నట్లు వారు తెలిపారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం.. ప్రస్తుతం హర్యానా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ గుప్తా ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడారు.
Prashanth Kishor: నితీష్‌కు వయసు మీద పడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు..
“ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. జీవనాధార ఔషధాలతో ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది” అని ఆయన వెల్లడించారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22న ఆయన ఆస్పత్రి చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. 82 ఏళ్ల వయస్సు గల ములాయం పరిస్థితి ఆదివారం మరింత క్షీణించింది. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్పత్రికి వచ్చి పరామర్శించిన సంగతి తెలిసిందే. ములాయం ప్రాణాలను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు.