నోయిడాలోలోని సెక్టార్ 93ఏలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్విన్ టవర్స్‌ను ఆదివారం అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. ట్విన్ టవర్స్‌ను 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించి దాదాపు తొమ్మిది సెకన్ల వ్యవధిలో కూల్చివేశారు. తద్వారా తొమ్మిదేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటానికి ముగింపు పలికింది.
చిరిగిపోయిన రూ.200 నోటు తీసుకునేందుకు నిరాకరించాడని పిజ్జా డెలివరీ బాయ్‌ని ఓ వ్యక్తి తుపాకితో కాల్చాడు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం ఆగ్రా కళాశాల ప్రవేశ ద్వారం తెరవకపోవడంతో ఎగ్జిబిషన్‌కు హాజరుకాకుండానే తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను అల్లకల్లోలం చేసింది. కొందరికి పూటగడవడమే కష్టంగా మారింది. జాతీయ టోర్నమెంట్లలో ఆడి మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజబాబుది కూడా అదే పరిస్థితి. రాజబాబు అనే విభిన్న ప్రతిభావంతుడైన క్రికెటర్ ఇప్పుడు ఘజియాబాద్‌లో ఇ-రిక్షా నడుపుతూ పాలు అమ్ముతున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బండాలో శుక్రవారం కారు టెంపోను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మరణించగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి టెంపో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
యూపీలోని లఖింపూర్ ఖేరీలో రైతులపై జరిగిన హింసాకాండ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ మంగళవారం నిరాకరించింది.
ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం రెండు రాష్ట్రాల్లో వేర్వేరు ఘటనల్లో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై 14 మంది మృతి చెందగా.. మరో 16 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
With an aim to boost connectivity in Uttar Pradesh, Prime Minister Narendra Modi will inaugurate the Bundelkhand Expressway at Kaitheri village in Orai tehsil of Jalaun district on Saturday.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Saturday announced an ex-gratia of Rs 2 lakh each for the next of kin of those who have lost their lives and Rs 50,000 to the injured after six people were killed and two others were injured in an accident in Chitrakoot.