Student Shoots Teacher: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. తనను టీచర్ తిట్టాడనే కోపంతో నాటుతుపాకీతో ఓ విద్యార్థి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే ఉపాధ్యాయుడికి బుల్లెట్లు సున్నిత అవయవాలకు తాకకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మెరుగైన చికిత్స నిమిత్తం ఆ టీచర్‌ను లక్నోకు తరలించారు.
Maharashtra: ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలపై తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర సర్కారు..
వివరాల్లోకి వెళ్తే… సీతాపూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు మరో విద్యార్థితో గొడవపడ్డాడు. వారిద్దరు ఉపాధ్యాయుడి దగ్గరకు వెళ్లగా.. వారిద్దరిని ఆయన మందలించి అక్కడి నుంచి పంపాడు. దీంతో టీచర్‌పై కక్ష గట్టిన విద్యార్థి నాటుతుపాకీతో ఉపాధ్యాయుడిపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ కాల్పుల ఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. పారిపోతున్న విద్యార్థిని స్థానికులు పట్టుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.