Yogi Government: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని వాహనాలపై ట్రాఫిక్ చలాన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో వాహనాలపై నమోదైన ట్రాఫిక్ చలాన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో లక్షలాది మంది వాహనదారులకు ఊరట లభించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. వాహనదారులు ఎలాంటి భయం లేకుండా వెబ్‌సైట్‌లోని వాహన నంబర్ ఆధారంగా వివరాలను సరిచూసుకోవచ్చని వివరించారు. వాహనాలపై నమోదైన ట్రాఫిక్ చలాన్లను మాత్రమే రద్దు చేస్తామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని అన్ని రకాల ప్రైవేట్ మరియు వాణిజ్య వాహనాలపై విధించిన అన్ని ట్రాఫిక్ చలాన్‌లను జనవరి 1, 2017 నుండి డిసెంబర్ 31, 2021 వరకు రద్దు చేస్తున్నట్లు యోగి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జూన్ 2023లో 2వ నంబర్ జీవోను విడుదల చేసింది. చలాన్లు నమోదు చేసి కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న వాహనాలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. వాహనాలపై ట్రాఫిక్ చలాన్లను రద్దు చేయాలని ఇటీవల నోయిడా రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయడం గమనార్హం.
ఇక యోగి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రవాణా కమిషనర్ చంద్ర భూషణ్ సింగ్ అన్ని ప్రాంతీయ రవాణా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేసుల జాబితాను కోర్టు ఇచ్చిన తర్వాత.. రవాణా పోర్టల్ నుంచి అన్ని చలాన్లను తొలగించాలని సూచించారు. ఉత్తరప్రదేశ్ తీసుకున్న నిర్ణయంతో ఆ రాష్ట్రంలోని ప్రైవేట్, వాణిజ్య వాహనదారులకు భారీ ఊరట లభించింది. యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న ఈ నిర్ణయంపై లక్షలాది మంది వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. యోగి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో చలాన్లకు సంబంధించిన కోట్లాది రూపాయల పెండింగ్ బిల్లులు మాఫీ అయ్యాయి. ఎవరికీ చలాన్లు చెల్లించేందుకు భయపడవద్దని అధికారులు వాహనదారులకు సూచించారు. ఇంట్లో కూర్చొని ఆన్ లైన్ లో దరఖాస్తు నింపితే సరిపోతుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఉత్తరప్రదేశ్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. వాహనం నంబర్ ఆధారంగానే చలాన్ల వివరాలు తెలుస్తాయని వివరించారు. ఏదైనా వాహనంపై తప్పుడు చలాన్లు విధించినట్లు డ్రైవర్లు గుర్తిస్తే, నేరుగా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. వాహనంపై ఉన్న చలాన్‌లను రద్దు చేసిన తర్వాత వాహనదారుడి మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుందన్నారు.
Harassing: వెంటబడి వేధించాడు.. చెప్పుతో కొట్టిన యువతి