Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో భారత చట్టాలే అమలవుతున్నాయని ఆయన అన్నారు. శాంతి, అభివృద్ధితో కాశ్మీర్ ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. ఈ రోజు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా భారత్ లో భాగం కావాలని కోరుకుంటున్నారని, వారు కూడా భారత్ లో చేరాలని, పీఓకే భారత్ లో భాగం కావాలని కోరుకుంటున్నారని యోగీ అన్నారు. దరిద్ర పాకిస్తాన్ వెంట ఎవరూ నిలబడరని ఆయన అన్నారు.
Read Also: Assam Floods: అస్సాంలో వర్ష బీభత్సం.. వరదల్లో 31 వేల మంది
జనసంపర్క అభియాన్ కింద అంబేద్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా సంబంధాల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌పై సీఎం యోగి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ పరిస్థితి పేదవాడిలా తయారైందని, పాక్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, అక్కడ ఆహారం కోసం గొడవలు జరుగుతున్నాయని అన్నారు. పీఓకే ప్రజలు భారత్ లో చేరాలని అనుకుంటున్నారని యోగీ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో త్వరలో ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని సీఎం యోగి అన్నారు. ఆర్టికల్ 370ని ఎప్పటికీ తొలగించలేమని ప్రజలు ఏవిధంగా అనుకున్నారు.. ఇప్పుడు ఇదే ఆలోచన తీవ్రవాదంపై ఉందన్నారు. ఆర్టికల్ 370లాగే ఉగ్రవాదం అంతమవుతుందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కాశ్మీర్ భారత్ లో భాగమైందని చెప్పారు. 2024 జనవరిలో శ్రీరాముడి ఆలయం పూర్తవుతుందని, రాంలాలా తన ఆలయంలో కూర్చుంటారని ఆయన తెలిపారు.
#WATCH | Today Kashmir is governed by Indian laws and is moving forward with a new stream of peace and development. Today there is a demand in Pakistan Occupied Kashmir to make them a part of India, they also want to join India. Nobody wants to stand with Pakistan: Uttar Pradesh… pic.twitter.com/sVmUaDgZbb
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 20, 2023