ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తన ప్రేమికుడితో ఫోన్‌లో మాట్లాడిందనే కారణంతో ఓ భర్త తన భార్యను, అత్తను హత్య చేశాడు. ఆదివారం రాత్రి భర్త ఇంటికి రాగా, భార్య ప్రేమికుడితో మాట్లాడుతూ కనిపించింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి గొడవ దాకా వెళ్లింది. ఇంతలో భార్య తల్లి అడ్డుకోవడంతో ఆగ్రహించిన భర్త పదునైన ఆయుధంతో ఇద్దరినీ నరికి చంపాడు. నిందితుడైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
READ MORE: Pushpa2 : నేడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీస్ శాఖ
చాకేరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీలో నివాసముంటున్న జోసెఫ్ పీటర్ మెటల్ ప్రింటింగ్ చేసేవాడు. అతని భార్య కామిని ఇంట్లో అతనితో కలిసి ఉండేది. వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. 10 రోజుల క్రితం పీటర్ అత్త పుష్ప కూడా లక్నో నుంచి వీరి వద్దకు వచ్చింది. పీటర్ భార్య కామిని ఢిల్లీలోని స్నేహితుడితో తరచూ మొబైల్‌లో మాట్లాడుతుండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
READ MORE:Drug party : డ్రగ్స్ పార్టీ లో పట్టు బడ్డ కొరియోగ్రాఫర్ కన్హ మహంతి..
ఆదివారం రాత్రి పీటర్ ఇంటికి తిరిగి రాగా.. కామిని మొబైల్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు చూశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. భర్త భార్యను కొట్టాడు. కూతురిని కాపాడేందుకు అత్త రావడంతో పీటర్ ఆగ్రహం మరింత పెరిగింది. పదునైన ఆయుధంతో భార్య, అత్తను హత్య చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వారిద్దరినీ హత్య చేసిన తర్వాత కూడా ఇంట్లో నుంచి పారిపోకుండా లోపల నుంచి తలుపులు మూసేసి దాదాపు అరగంట సేపు వారి మృతదేహాల దగ్గర కూర్చొని చూస్తూ ఉండిపోయాడు. ఇరుగుపొరుగు వారి సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా పీటర్ ఇద్దరి మృతదేహాల దగ్గర కూర్చొని ఉన్నాడు. పీటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీటర్ తన నేరాన్ని అంగీకరించాడు.