ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్ జిల్లాలోని మహ్మద్‌పూర్ బర్వాలా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఒక చిన్నారితో సహా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. కుటుంబంలోని మిగిలిన ఇద్దరు సభ్యుల పరిస్థితి విషమంగా మారింది. అయితే.. అందరూ తోపుడు బండిపై విక్రయిస్తున్న కాల్చిన వేరుశనగ పప్పులు కొని తిన్నారని, ఆ తర్వాత వారి ఆరోగ్యం క్షీణించిందని చెబుతున్నారు.
READ MORE: Akkineni : గ్రాండ్ గా ‘జైనాబ్’ తో అక్కినేని అఖిల్ నిశ్చితార్ధం
పోలీసుల కథనం ప్రకారం.. నవంబర్ 24 సాయంత్రం బాధిత కుటుంబం మార్కెట్‌లోని బండిపై కాల్చిన శెనగల పప్పు తీసుకొచ్చారు. ఇంట్లో వండిన ఆహారంతోపాటు కలిపి తిన్నారు. ఆ తర్వాత 50 ఏళ్ల వృద్ధుడు, ఇంటి యజమాని కలువా సింగ్, 8 ఏళ్ల అమాయక మనవడు లావిష్ సోమవారం ఉదయం మరణించారు. కోడలు జోగేంద్రి మంగళవారం చికిత్స పొందుతూ.. మృతి చెందింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలను తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సోమవారం ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించకుండానే బంధువులు దహనం చేశారు.
READ MORE:Youngest Players IPL: 2025 వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కులు వీళ్లే..
అయితే మంగళవారం చనిపోయిన మహిళకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరణానికి కారణం ఏమిటో తేలిపోనుంది. ఈ మొత్తం వ్యవహారంలో శనగపప్పు, ఇతర ఆహార పదార్థాల శాంపిల్స్ తీసి ల్యాబ్‌కు పంపుతున్నామని ఫుడ్ ఆఫీసర్ వినీత్ కుమార్ తెలిపారు. అవకతవకలు జరిగినట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందన్నారు.