Noida Airport: జెవార్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్.. త్వరలో పూర్తి సేవలు
- నోయిడాలోని జెవార్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్
- ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానున్న విమాన సేవలు
- గొప్ప విజయం అన్న విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోయిడాలోని జెవార్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో తొలి విమాన టెస్టింగ్ విజయవంతంగా ముగిసింది. సోమవారం అధికారులు నిర్వహించిన ఫ్లైట్ టెస్ట్ సక్సెస్‌గా ముగిసింది. ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం నోయిడాలో దిగింది. విమానం ల్యాండ్ కాగానే.. ఫైర్ ట్యాంకర్లతో నీటిని వెదజల్లి స్వాగతం పలికాయి. విమానం ల్యాండింగ్‌పై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఇది గొప్ప విజయం అని కొనియాడారు. 2025, ఏప్రిల్ నుంచి ఈ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో సేవలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: MLC Botsa Satyanarayana: సిట్ రిపోర్ట్‌ను బహిర్గతం చేయాలి.. కేంద్రానికి లేఖ రాస్తానన్న బొత్స
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఉన్న నోయిడాలోని జేవార్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. సోమవారం అధికారులు తొలి విమాన పరీక్ష నిర్వహించారు. నోయిడా విమానాశ్రయంలోని రన్‌వేపై ఇండిగో విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజల కోసం కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎయిర్‌పోర్టు ప్రారంభమైతే ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో రెండో అతిపెద్ద ప్రధాన విమానాశ్రయంగా గుర్తింపు పొందుతుంది.
ఇది కూడా చదవండి: Jaggareddy: సోనియా గాంధీ బర్త్‌డే వేడుకలు.. పోతురాజులతో జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్
జెవార్ ఎయిర్‌పోర్ట్ ఏప్రిల్ 17, 2025న కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ధృవీకరించింది. ప్రారంభంలో వివిధ ప్రదేశాలకు 30 విమాన సర్వీసులను అందించనుందని పేర్కొంది. ఇండిగో, అకాసా ఎయిర్‌లతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. దేశీయ మార్గాలకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అంతర్జాతీయ కనెక్షన్ల కోసం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌తో చర్చిస్తున్నట్లు తెలిపింది. వాస్తవానికి సెప్టెంబరు, 2023లో ప్రారంభించాలని అనుకున్నారు. కానీ సాధ్యపడలేదు. త్వరలో జెవార్ విమానాశ్రయం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో రెండవ అతిపెద్ద విమానాశ్రయంగా మారనుంది. ప్రారంభంలో 62 దేశీయ, రెండు అంతర్జాతీయ, ఒక కార్గో మార్గంతో సహా 65 రోజువారీ విమానాలను అందించనుది. పూర్తిగా కార్యాచరణలోకి వస్తే ఆసియాలోని అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటిగా, ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద విమానాశ్రయంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.
#WATCH | Uttar Pradesh: Noida International Airport Limited (NIAL) conducts the first flight validation test for Noida International Airport ahead of the airport’s commercial opening in April 2025. pic.twitter.com/C3axT4mZeH
— ANI (@ANI) December 9, 2024
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!