సూర్యాపేట జిల్లా మోతె, నడిగూడెం మండల కేంద్రాల్లో నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని విద్వేషాలను సృష్టిస్తుందని, బీజేపీకి మరో అవకాశం ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లకు తూట్లు పడతాయని…
కాళేశ్వరం విషయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్ లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏడాదికి కరెంట్ బిల్లే రూ.10 వేల కోట్లు అవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు కూడా చేయలేదని విమర్శించారు.
ఈ ప్రభుత్వ హయాంలో రైతు బంధు, రైతు బీమా ఉంటుందో.. ఉండదో తెలియని పరిస్థితి ఏర్పడిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. బస్సు యాత్రలో భాగంగా సూర్యాపేటకు చేరుకున్న ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
రాష్ట్రంలో నీళ్ల పంచాయితీ మళ్లీ మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టుల విషయంపై అధికార పార్టీ, బీఆర్ఎస్ నాయకులు రాళ్లు రువ్వుకున్నారు. తప్పు మీదంటే.. మీదంటూ ఒకరినోకరు విమర్శించుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ప్రచారం జోరందుకుంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పార్లమెంట్ నియోజకవర్గా్ల్లో తిరుగుతూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ సీట్లు గెలుస్తాం.. జూన్ 9వ తేదీన రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
MP Arvind: ఉత్తమ్ ను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్ఆర్సీ అమలు చేయమని మంత్రి ఉత్తమ్ చెప్పడం దేశ ద్రోహమే అన్నారు.
నేను పార్టీ మారడం లేదు.. క్లారిటీ ఇచ్చిన మాలోత్ కవిత పార్టీ మారడం లేదని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత క్లారిటీ ఇచ్చారు. తనపైన రాజకీయ అత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారను… పోటీలోనే ఉంటానని స్పష్టం చేశారు మాలోతు కవిత. పార్టీ గెలిచే స్థానాల్లో మహబూబాబాద్ ఒకటి అని.. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని ఆమె అన్నారు.…
నల్లగొండ పార్లమెంట్ స్థానాన్ని భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తామని సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవడం ఖాయమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీ…
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామ స్వామి గుట్టపై పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ శంకుస్థాపన చేశారు. రూ.74.80 కోట్లతో 2160 సింగిల్ బెడ్రూం ప్లాట్ ల నిర్మాణానికి శంకుస్థాపన, పైలాన్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ కావాలనే ఇళ్లను పూర్తి కాకుండా చేశారని అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఏడాదికి 3500…