బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ సందర్శనకు పోవాలి.. క్షమాపణ చెప్పాలని అన్నారు. చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ పోయి చూసి.. ప్రజలకు క్షమాపణ చెప్తే బాగుంటుందని ఆరోపించారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.. బీఆర్ఎస్ వాళ్లకు అన్నీ చూపెట్టమని అని తెలిపారు. కాళేశ్వరంపై పెద్ద ఫ్రాడ్ చేసి.. ఉల్టా తమపై ఆరోపణలు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తెలంగాణలో మరో రెండు పథకాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఎవరూ మర్చిపోలేని రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. తెల్లకార్డు ఉన్న వారికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గత మూడేళ్ళుగా యావరేజ్ గా ఎన్ని సిలిండర్లు వాడారో అన్ని సిలిండర్లు ఇస్తామని ఆయన వెల్లడించారు. సుమారు 40 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని, భవిష్యత్ లో తెల్ల కార్డు…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నారం…సుందిళ్ల..మేడిగడ్డ మూడే దెబ్బతిన్నాయి కదా అంటున్నారని, అంత సింపుల్ గా తీసుకుంటున్నారు బీఆర్‌ఎస్ వాళ్లని మండిపడ్డారు. సీరియస్ ప్రాబ్లం తీసుకుని.. అయితే ఏంటి అన్నట్టు మాట్లాడితే ప్రయోజనం ఉందా..?అని ఆయన ప్రశ్నించారు. కుంగిన బ్యారేజీల పై నివేదిక తెప్పిస్తామన్నారు. ఎలా పునరుద్దరణ చేయాలి అనేది ఆలోచిస్తామని, మా…
తెలంగాణలో జరిగిన అతి పెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం డ్యామేజీలో ఉన్నాయన్నారు.
తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం.. అసెంబ్లీలో ఆమోదం.. తెలంగాణ రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును తెలంగాణ శాసనసభ సోమవారం ఆమోదించింది. సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం 2003 సవరణ బిల్లు ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఈ రోజు సభ సమావేశమైన వెంటనే, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తరపున శాసనసభా వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను…
Uttam Kumar Reddy: ఏపీకి 512.. టీఎస్ కి 299 టీఎంసీకి ఎలా ఒప్పుకున్నారు? ఇది తెలంగాణకు అన్యాయం కాదా? అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
ఎస్ఎల్‌బీసీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. పదేళ్లలో కిలోమీటర్ తవ్వారని ఇటీవల ప్రెస్‌మీట్‌లో రేవంత్ చెప్పారని.. కానీ తమ హయాంలో 11 కిలోమీటర్లు తవ్వామని తెలిపారు. తాము విమర్శలు చేయాలంటే చాలా చేస్తాం.. కానీ మైక్ కట్ అవుతుందని తెలిపారు. ఎన్నికలు జరిగే రోజు ఏపీ పోలీసులు అన్యాయంగా వచ్చారన్నారు. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్‌లో, నాగార్జున సాగర్ తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్‌లో ఉంటుందని... కానీ…
గత ప్రభుత్వం వల్లే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినట్లుగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డుకు తాము ప్రాజెక్టులు అప్పగించలేదని తెలిపారు. ఎక్కడి నుండో మినిట్స్ తెచ్చి సమాధానం చెప్పు అంటే ఎలా అని ప్రశ్నించారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రూ.26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే ఆరోగ్య శ్రీ పతకాన్ని రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామని ఆయన తెలిపారు. రెడ్ల…