ఈనెల 15న సీతారామ ప్రాజెక్టులోని 3 పంపులను ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2026 ఆగస్టు 15కు పూర్తి చేయబోతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను, ఇరిగేషన్ శాఖను నాశనం చేశారని, ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టె ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పదేళ్లలో 1.81లక్షల కోట్లు ఇరిగేషన్ శాఖకు ఖర్చు చేసి నామమాత్రంగా పనులు చేశారని, కాళేశ్వరంకు లక్ష కోట్లు…
ప్రారంభోత్సవానికి సీతారాం ప్రాజెక్ట్ మూడు పంప్ హౌస్లు సిద్దంగా ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆగస్ట్ 15 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవమని, ఈ ఆదివారం రోజున ట్రయిల్ రన్ కు ఏర్పాట్లు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పంప్ హౌజ్ ల ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సీతారామ ప్రాజెక్ట్ అనుమతులు చేరాయి. సీతారామ…
నీటి పారుదల ప్రాజెక్టులలో పూడిక తీత అంశంపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సయిజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా.. సుంకిశాల ప్రాజెక్టును మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సందర్శించారు. కూలిన రిటైనింగ్ సైడ్వాల్ను పరిశీలించారు. నీట మునిగిన ఇన్టెక్ వెల్, పంపింగ్ స్టేషన్ను మంత్రులు పరిశీలించారు.
Sunkishala Project: నేడు నల్గొండ జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. సుంకిశాల ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు.
కొత్త రేషన్ కార్డుల పంపిణీని పర్యవేక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ సబ్‌కమిటీలో పౌరసరఫరాలు & నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాల శాఖ సబ్‌కమిటీకి…
Uttam Kumar Reddy: నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరులు, నది అభివృద్ధి & గంగా పునరుజ్జీవన శాఖ, జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను స్వీకరించడం మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహణ కోసం జాతీయ ఫ్రేమ్‌వర్క్ పై పద్ధతులు/మార్గ దర్శకాలను అధ్యయనం చేయడానికి, అలాగే సిఫార్సు చేయడానికి ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.…
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల తర్వాత నాగార్జునసాగర్ లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడం నా అదృష్టమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు మొదటి వారంలో ఎడమ కాలువకు సాగు నీటిని విడుదల చేశామని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ ను నాశనం చేసిందని, గత ప్రభుత్వం…
అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎల్లుండి జరిగే కేబినెట్ మీటింగ్ లో విధివిధానాలు ఖరార చేయనున్నట్లు ఆయన తెలిపారు. రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తామని ఆయన తెలిపారు. అర్హులందరికీ త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెల్ల రేషన కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్ ఇస్తామని స్పష్టం చేశారు ఉత్తమ్. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రేషన్ కార్డుపై…
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి పారుదల అధికారులతో సమీక్ష నిర్వహించామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక బడ్జెట్లో నీటిపారుదల రంగం మీద స్పష్టత వచ్చిందన్నారు. 10,820 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కేటాయించిందని, ఎక్కడ పనులు అగాయో.. ఎవరికి పెమేంట్ ఇవ్వాలి అనేది సమీక్షలో చర్చ జరిగిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాన కాలంలో కొన్ని చోట్ల వరద వచ్చే అవకాశం ఉందని, నీటిపారుదల సంబంధించి…