కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. “రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డువడ్లు పండిస్తారు. అది తెలిసే సన్న వడ్ల కు 5 వందల బొనస్ అంటూ ప్రకటన చేశారు. యసంగిలో తెలంగాణలో సన్న వడ్లు పండవు.. బోనస్ ఇవ్వకుండా ఎగబెట్టడమే కోసమే ఇది. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని అసెంబ్లీలో చేతులు ఎత్తేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ మ్యనిఫెస్ట్ లో ఇచ్చినట్టుగా పంటలకు బోనస్ ఇవ్వాలినీ డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ మ్యనిఫెస్ట్ లో ఎక్కడ సన్నవడ్లు అని రాయాలేదు.. అప్పుడు వరి ధాన్యం అని మాత్రమే రాశారు. రాష్ట్ర రైతులకు హామీ ఇచ్చి.. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. రైతు భరోసా ఇస్తాం అన్నారు.. కానీ రైతు బంధూ పాక్షికంగా ఇచ్చారు. రాహుల్ గాంధీ నిర్మల్ సభలో రైతు భరోసా ఇచ్చాము అని చెప్పారు. కానీ ఇవ్వలేదు.కాబట్టి మిగతా 2500 రూపాయలు యసంగిలో రైతులకు ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసా కింద ఎకరానికి 7500 రూపాయలను జూన్ నెలలోనే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ను BRS డిమాండ్ చేస్తున్నది.” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: Mango Bobbatlu: అసలు ఎప్పుడైనా మామిడి బొబ్బట్లను ట్రై చేసారా.. ఇలా ట్రై చేయండి..
వరి కి బోనస్ పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని హరీష్ రావు అన్నారు. “ఎప్పటి నుంచి 500 రూపాయలు బోనస్ ఇచ్చి దొడ్డు వడ్లు కొంటారో చెప్పాలి. ఇతర పంటలకు బోనస్ ఇచ్చే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని BRS పోరాటం చేస్తుంది. రైతుల పక్షాన పోరాటం చేస్తాం. వరి బోనస్ బోగస్ అయ్యింది. భట్టి మాటలు వట్టి మాటలు అని తేలింది. వడ్లు తడిసినవి కాబట్టి తీసుకొం అని రైస్ మిల్లులు అంటున్నాయి. వరి ధాన్యం సేకరణ సరిగ్గా లేక.. రైతులు ఇబ్బంది పడుతున్నారు.రెండు మూడు రోజులు వడ్లు రైస్ మిల్లులు దగ్గర దించుకునే పరిస్థి.తి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అయిన స్పందించాలి. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి. ఎకరానికి 25 వేలు పంట నష్టం ను రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం సేకరణను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నాం.” అని ఆయన పేర్కొన్నారు.