ఉత్తమ్ స్పందన కోసం నిన్న పొద్దుపోయేదాకా ఎదురు చూసిన.. నేను వాస్తవాలు చెప్పాను కాబట్టే ఉత్తమ్ మొహం చాటేశారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఏం చేయాలో తెలియక నాపై పోలీస్ కేసు పెట్టించారని, ఉత్తమ్ కు చేతనైతే బహిరంగ చర్చకు రావాలన్నారు మహేశ్వర్ రెడ్డి. లేదా సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసిన సరే సాక్ష్యాధారాలతో నిరూపించడానికి రెడీ గా ఉన్నానని, సివిల్ సప్లై లో ఉన్న అవకతవకలు ఏ విధంగా సరి చేస్తారో చెప్పాలన్నారు మహేశ్వర్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టమంటే పెట్టానని జగ్గారెడ్డి చెబుతున్నారని, సివిల్ సప్లై మీద జగ్గ రెడ్డికి అవగాహన ఉండొచ్చు అని ఆయన మండిపడ్డారు. పోలీస్ కేసుల వల్ల సమస్య పరిష్కారం కాదని, 25- 1-24 న ఇచ్చిన జీవో లో స్పష్టంగా టెండర్ ప్రాసెసింగ్ చేయాలని చెప్పారన్నారు. అదే రోజు గ్లోబల్ టెండర్ పిలిచారని, గ్లోబల్ టెండర్ కోసం వివిధ రాష్ట్రాల నుంచి కొంత మంది వచ్చింది నిజం కాదా.. ? అదే రోజు కొంత మంది మిల్లర్లను పిలిచి ఏం చేశారో అధారాతో బయట పెట్టమంటారా..? చౌహాన్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చెప్పాలన్నారు. క్వింటాలుకు 216 రూపాయాలు రైస్ మిల్లర్లు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసింది నిజం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. మీరు చేసిన వసూళ్ల అరాచకం బయట పెట్టమంటారా..? అని ఆయన అన్నారు.
అంతేకాకుండా..’ఉత్తమ్ కు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు ఎందుకు రావడం లేదో చెప్పాలి. పోలీస్ కేసులకు, లీగల్ యాక్షన్లకు భయపడే వాడు కాదు ఏలేటి. కాలేజీలను, కోట్ల ఆస్తులను వదులుకొని రాజకీయాలపై మక్కువతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని.. 35 లక్షల మెట్రిక్ టన్నుల మీద 216 రూపాయలు వసూళ్లు జేస్తే 8 వందల కోట్లు వసూళ్లు చేశారా లేదా..? 60 రోజులవుతున్న ధాన్యాన్ని ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు. ధాన్యాన్ని లిఫ్ట్ చేయకపోతే టెండర్లు తీసుకున్న కంపెనీలు ఏం చేస్తున్నట్టు..? 1 లక్ష మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని క్వింటాలుకు 2259 రూపాయలకు అమ్మి, 2 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని క్వింటాల్ కు 5 వేల 700 పెట్టీ కొనడం వెనక మతలబు ఏంటో చెప్పాలి. ఒక్కొక్క చిట్టా మొత్తం విప్పుతా, నా దగ్గర పూర్తి సమాచారం ఉంది..’ అని మహేశ్వర్ రెడ్డి అన్నారు.