ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. వచ్చేవారంలో ప్రధాని మోడీ అమెరికాకు వెళ్లనున్నారు. క్వాడ్ దేశాల సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో సమావేశం కానున్నారు. అనంతరం మోడి సెప్టెంబర్ 25 వ తేదీన ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు. రెండు రోజులపాటు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నట్టు పీఎంవో కార్యాలయం తెలియజేసింది. ఈనెల 24 వ తేదీన క్వాడ్ దేశాల సదస్సు జరగనున్నది. ఇండియా, అమెరికా, జపాన్, అస్ట్రేలియా దేశాలు క్వాడ్…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో సేనలు పూర్తిగా తప్పుకున్నాయి. 2001 నుంచి 2021 వరకు దాదాపు 80 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఆఫ్ఘనిస్తాన్‌కు సమకూర్చింది. ఇందులో అధునాతనమైన 73 అపాచీ హెలికాఫ్టర్లు ఉన్నాయి. వీటితో పాటుగా అనేక ఆయుధాలు ఉన్నాయి. అమెరికా దళాలు బయటకు వచ్చే సమయంలో కొన్నింటని వెనక్కి తీసుకొచ్చారు. కొన్ని ఆయుధాలను అక్కడే వదిలేసి వచ్చారు. ఇప్పుడు అక్కడ వదిలేసి వచ్చిన వాటిపై అమెరికా అందోళన వ్యక్తం చేస్తున్నది. అమెరికా వదిలేసి వచ్చిన…
అమెరికాలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వ్యాక్సిన్ల కొరత లేనప్పటికీ మతపరమైన కారణాలు, ఇతర సొంత కారణాల వలన వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా మంది నిరాకరిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారిపై వివక్ష మొదలైంది. ట్యాక్సీల్లో ప్రయాణం చేయాలంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కొన్ని ట్యాక్సీ సంస్థలు నిబంధనలు పెడుతున్నాయి. ఉద్యోగాల విషయంలో కూడా…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కొలువుదీరింది. తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చైనా తామున్నామని హామీ ఇచ్చింది. హామీతో పాటుగా ఆ ప్రభుత్వానికి రూ.229 కోట్ల రూపాయలను తక్షణ సాయంగా అందించింది. ఎలాగైనా ఆఫ్ఘనిస్తాన్‌ను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి చైనా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. పాక్ అనుకూల వర్గం చేత ఈ పని చేయిస్తున్నది చైనా. అటు రష్యాకూడా ఆఫ్ఘన్ విషయంలో వేగంగా పావులు కదుపుతున్నది. రష్యాకు ఆక్రమణలకు వ్యతిరేకంగా ఏర్పటిన సంస్థే తాలిబన్. రష్యా సేనలు…
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో 11 మంది మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో అమెరికాలోని వాషింగ్టన్, ఫ్లోరిడా, హ్యూస్టన్ సిటిలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలో ఓ సైకో జరిపిన కాల్పుల్లో నలుగురు, హ్యూస్టన్ లో నలుగురు, వాషింగ్టన్లో ముగ్గురు మృతి చెందారు. విచ్చలవిడిగా గన్ కల్చర్ పెరిగిపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. గత కొంతకాలంగా అమెరికాలో గన్‌కలచ్చర్ పెరిగిపోతున్నది. కరోనా కాలంలో ఈ గన్ కల్చర్ మరింతగా పెరిగింది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కాబోతున్నారు. ఈ నెలాఖరులో యుఎస్‌లో ప్రధాని మోడీ పర్యటించే అవకాశం ఉంది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత…తొలిసారి అమెరికా వెళ్తున్నారు. మోడీ, బైడెన్ సమావేశం తేదీలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయ్. అన్నీ అనుకున్నట్లు జరిగితే…ఈ నెల 22-27 మధ్యలో ఇరువురు నేతలు సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ, జో బైడెన్లు…వర్చువల్ విధానంలో ఇప్పటి మూడుసార్లు చర్చలు…
గత నెల రోజుల క్రితం చైనాను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వెయ్యేళ్ల కాలంలో ఎప్పుడూ కూడా ఆ స్థాయిలో వర్షాలు కురవలేదని చైనా అధికారులు పేర్కొన్నారు. రోడ్లపై నడుం లోతుల్లో నీళ్లు రావడంతో పాటుగా అటు షాపింగ్ మాల్స్, సెల్లార్లు, బస్సులు, రైళ్లు అన్నీ కూడా నీటిలో సగం వరకు మునిగిపోయిన దృశ్యాలను చూశాం. ఆ పరిస్థితి నుంచి బయటపడేసరికి చైనాకు తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది. కాగా, ఇప్పుడు అమెరికాను భారీ…
అమెరికాలో కరోనా కేసులు తగ్గినట్టుగానే తగ్గి తిరిగి భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ప్రతిరోజూ ఆ దేశంలో లక్ష వరకు కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఒకవైపు కరోనా కేసులతో అతలాకుతలం అవుతుంటే, ఇప్పుడు భారీ వర్షాలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. హరికేన్ ఇదా దెబ్బకు దేశం విలవిలలాడిపోతున్నది. న్యూయార్క్‌లో ఎప్పడూ లేని విధంగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ప్రమాదకరమైన స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. రోడ్లన్ని సెలయేరులా మారిపోవడంతో ఎమర్జెన్నీని విధించారు.…
రెండు దశాబ్దాలపాటు ఆఫ్ఘనిస్తాన్‌లో రక్షణ బాధ్యతలు నిర్వహించిన అమెరికా, ఇటీవలే ఆ దేశం నుంచి పూర్తిగా తప్పుకున్నది. అమెరికా దళాలు పూర్తిగా వైదొలిగాయి. పూర్తిగా వైదొలిగిన తరువాత, తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. అమెరికా వదలి వెళ్లిన ఆయుధ సామాగ్రిని తాలిబన్ నేతలు స్వాధీనం చేసుకున్నారు. అవసరమైన ఆయుధాలను, ప్రజలను, సైనికులను తరలించిన అమెరికా, ఎన్నో ఏళ్లపాటు వారితో కలిసి పనిచేసిన జాగిలాలను కాబూల్ ఎయిర్‌పోర్టులోనే వదలి వెళ్లారు. దీంతో ఆ జాగిలాలు ఆకలితో అలమటిస్తున్నాయి. జాగిలాలలను అలా…
అగ్రదేశం అమెరికాను కొత్త సమస్య వేధిస్తోంది. డెల్టా వేరియంట్ విజృంభణతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఆ దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. మరీ ముఖ్యంగా దక్షిణ అమెరికాలో సమస్యను ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఫ్లొరిడా, సౌత్ కరోలినా, టెక్సాస్, లూసియానాలోని ఆసుపత్రుల్లో ఈ కొరత తీవ్రంగా ఉందని అక్కడి వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల రిజర్వ్ చేసిన ఆక్సిజన్ వాడాల్సి వస్తుండగా… మరికొన్ని చోట్ల పూర్తిగా నిండుకునే పరిస్థితి ఉందని చెప్పారు. ‘సాధారణంగా…