ప్రపంచం నుంచి కరోనా ఇంకా దూరం కాలేదు. అమెరికా వంటి దేశాల్లో కరోనా ఉధృతంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రెండు వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తుంటే కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్ ను వ్యతిరేకిస్తున్నారు. కరోనా నుంచి బయట పడలేదు కాబట్టి తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని ప్రభుత్వం ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది. …
ప్రధాని మోడీ ఈరోజు అమెరికా పర్యటనకు బయలుదేరబోతున్నారు. ప్రధాని మోడీతో పాటుగా అయన బృందంలో విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్.జయశంకర్, విదేశీ వ్యవహరాల కార్యదర్శి హెచ్.వి. శ్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. సెప్టెంబర్ 23 వ తేదీన అస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాన మంత్రి యోషిహిదె సుగ లతో విడివిడిగా ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. యాపిల్ సీఈవో టీమ్ కుక్ తో పాటుగా అనేక అమెరికా…
అమెరికా వెళ్లేవారికి అక్కడి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికీ అమెరికాలోకి అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాక్సిన్లు తీసుకున్న వారికీ మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం ఏడు వ్యాక్సిన్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఇందులో మోడెర్నా, ఫైజర్ ఎన్ బయోటెక్, జాన్సన్ అండ్ జాన్సన్, ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనకా, కొవిషీల్డ్ టీకాలు తీసుకున్నవారికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు అమెరికా సీడీసీ తెలియజేసింది. నవంబర్ నుంచి నిబంధనలకు లోబడి టీకాలు…
ఒకప్పుడు అమెరికా రష్యా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రెండు దేశాల మధ్య పచ్ఛన్నయుద్ధం జరిగింది. అయితే, 1991 దశకంలో యూఎస్ఎస్ఆర్ విచ్చిత్తి కావడంతో రష్యా ఆర్థికంగా కుదేలయింది. దీంతో అమెరికా తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే, గత రెండు దశాబ్దాల కాలంగా ఆసియాలో చైనా ఆర్థికంగా క్రమంగా ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో అమెరికా తరువాత రెండో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది. ఇప్పుడు అమెరికాను సవాల్ చేసే స్థాయికి ఎదగడంతో అమెరికా, చైనా…
అమెరికాలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నాయి. కేసులతో పాటుగా గత వారం రోజుల నుంచి మరణాల సంఖ్యకూడా భారీగా పెరుగుతున్నది. ప్రతిరోజూ 2 వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కోవిడ్‌తో శుక్రవారం రోజున అత్యధికంగా 2,579 మరణాలు సంభవించాయి. సగటున ప్రతిరోజూ 2,012 మరణాలు సంభవిస్తున్నాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. దేశంలోని ఫ్లోరిడా, టెక్సాస్, క్యాలిఫోర్నియా రాష్ట్రాల్లో అత్యధికంగా మరణాలు, కేసులు నమోదవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా డెల్టా వేరియంట్…
ఆమెరికాపై పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాక్ నిందలు వేస్తున్నదని ఆరోపించారు. 2001లో అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేసిన సమయంలో పాకిస్తాన్లో రాజకీయ సుస్థిరత లేదని, జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు చేసి పాలన చేజిక్కించుకున్నారని, ముషారఫ్‌కు అమెరికా మద్ధతు అవసరమవడంతో ఆఫ్ఘన్లో యుద్ధానికి మద్ధతు పలికారని, ఇది తప్పుడు నిర్ణయం అని పాక్ పీఎం పేర్కొన్నారు. అయితే, విదేశీదళాలకు వ్యతిరేకంగా వారికి శిక్షణ ఇచ్చామని, అమెరికాకు వ్యతిరేకంగా…
ఫ్రాన్స్, అమెరికా దేశాల మధ్య ప్రస్తుతం ఆధిపత్యపోరు జరుగుతున్నది. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశం తన బలాన్ని పెంచుకోవడంతో చెక్ పెట్టేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి అకూస్ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసేందుకు 2016లో ఒప్పంగం కుదుర్చుకున్న అస్ట్రేలియా దానిని పక్కన పెట్టింది. 60 బిలియన్ డాలర్లలో 12 జలాంతర్గాముల తయారీ కోసం ఒప్పందం కుదుర్చుకున్నది. అకూస్ కూటమి తెరమీదకు రావడంతో డీజిల్ జలాంతర్గాముల…
దక్షిణాసియాలో చైనా రోజురోజుకు తన దూకుడును పెంచుతున్నది. సైనిక బలగాన్ని పెంచుకుంటూ దక్షిణ సముద్రంతో పాటుగా ఇతర దేశాలపై కూడా తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే పాక్, శ్రీలంకతో పాటుగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైకూడా చైనా కన్నుపడింది. అటు హాంకాంగ్, వియాత్నం కూడా తమవే అని చెప్తున్నది. రోజు రోజుకు చైనా తన బలాన్ని పెంచుకుంటుండటంతో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఆసియాలోని ఇండియా, జపాన్, అస్ట్రేలియాతో కలిసి ఇప్పటికే క్వాడ్ కూటమిని ఏర్పాటు…
2001 ముందు వరకు ప్రపంచాన్ని గడగడలాడించిన అల్‌ఖైదా ఆ తరువాత సైలెంట్ అయింది. తన ఉనికి చాటుకుంటున్నప్పటికీ పెద్దగా దాని గురించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న 20 ఏళ్లు అ ఉగ్రవాద సంస్థ సైలెంట్‌గా ఉన్నది. కాగా, అమెరికా దళాలు తప్పుకోవడంతో మరలా తన ఉనికిని చాటుకోవడానికి మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అల్‌ఖైదా తిరిగి పుంజుకోవడానికి తాలిబన్లు సహకరిస్తున్నారని, పంజ్‌షీర్ ను వారి ఆధీనంలోకి…
కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అమెరికాలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. అక్కడ డెల్టా వేరియంట్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ కారణంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతున్నది. వ్యాక్సిన్‌పై చాలా మంది చూపిస్తున్న విముఖత కూడా ఇందుకు ఒక కారణం కావొచ్చు. సోమవారం రోజున అమెరికాలో లక్షకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా 1800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ తీవ్రదశకు చేరుకుందని…