2001 ముందు వరకు ప్రపంచాన్ని గడగడలాడించిన అల్‌ఖైదా ఆ తరువాత సైలెంట్ అయింది. తన ఉనికి చాటుకుంటున్నప్పటికీ పెద్దగా దాని గురించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న 20 ఏళ్లు అ ఉగ్రవాద సంస్థ సైలెంట్‌గా ఉన్నది. కాగా, అమెరికా దళాలు తప్పుకోవడంతో మరలా తన ఉనికిని చాటుకోవడానికి మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అల్‌ఖైదా తిరిగి పుంజుకోవడానికి తాలిబన్లు సహకరిస్తున్నారని, పంజ్‌షీర్ ను వారి ఆధీనంలోకి తీసుకురావడంతో అల్‌ఖైదా సహకరించినట్టు గతంతోనే వార్తలు వచ్చాయి. ఇది ఇప్పుడు అమెరికాను కలవరపెడుతున్నది. ఇప్పటికిప్పుడు ఆ ఉగ్రసంస్థ వలన అమెరికాకు ముప్పు లేకున్నా, రాబోయే రెండేళ్ల వ్వవధిలో అమెరికాకు ఆ సంస్థ వలన ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని అమెరికా నిఘాసంస్థ సీనియర్ అధికారి డేవిడ్ కొహెన్ పేర్కొన్నారు. ముందస్తుగా అల్‌ఖైదా కదలికలపై తప్పనిసరిగా నిఘా ఉంచాలని అన్నారు.