అమెరికాలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నాయి. కేసులతో పాటుగా గత వారం రోజుల నుంచి మరణాల సంఖ్యకూడా భారీగా పెరుగుతున్నది. ప్రతిరోజూ 2 వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కోవిడ్‌తో శుక్రవారం రోజున అత్యధికంగా 2,579 మరణాలు సంభవించాయి. సగటున ప్రతిరోజూ 2,012 మరణాలు సంభవిస్తున్నాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. దేశంలోని ఫ్లోరిడా, టెక్సాస్, క్యాలిఫోర్నియా రాష్ట్రాల్లో అత్యధికంగా మరణాలు, కేసులు నమోదవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా డెల్టా వేరియంట్ కేసులే అని, ప్రజలు మరికొంతకాలం పాటు జాగ్రత్తగా ఉండాలని సీడీసీ వెల్లడించింది. అమెరికాలో ఇప్పటి వరకు 54 శాతం మంది రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోగా, 66 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు.
Read: హైదరాబాద్‌లో గణపతి లడ్డూల వేలంపాటలు… ఎక్కడ ఎంత అంటే…