కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అమెరికాలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. అక్కడ డెల్టా వేరియంట్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ కారణంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతున్నది. వ్యాక్సిన్‌పై చాలా మంది చూపిస్తున్న విముఖత కూడా ఇందుకు ఒక కారణం కావొచ్చు. సోమవారం రోజున అమెరికాలో లక్షకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా 1800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ తీవ్రదశకు చేరుకుందని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటి పేర్కొన్నది. ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read: పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం… ఆ ఒక్క నియోజక వర్గంలోనే…