అమెరికాలోని అనేక బీచ్ ఒడ్డున వేలాది సాండ్ డాలర్లు కొట్టుకు వస్తున్నాయి. ఇలా బీచ్‌లకు కొట్టుకొస్తున్న సాండ్ డాలర్లు నీరు వెనక్కి వెళ్లిపోగానే మృతి చెందుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఇటీవల కాలంలో వేల సంఖ్యలో ఇలా సాండ్ డాలర్లు కొట్టుకు వస్తుండటంతో పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సముద్రంలోని నీరు వేడిగా ఉండే ప్రాంతాల్లో ఇవి నివశిస్తుంటాయి. అయితే, సముద్రంలోని వాతారవణంలో వస్తున్న మార్పుల కారణంగా ఇవి ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన…
ఎప్పుడైతే అమెరికా తన బలగాలను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిందో అప్పటి నుంచి తాలిబన్లు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. అతి తక్కువ సమయంలోనే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆదీనంలోకి తెచ్చుకున్నారు. ఈ నెలాఖరు వరకు ఆమెరికా పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగనున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దళాలు ఉన్నప్పుడే తాలిబన్లు వివిధ మార్గాల ద్వారా భారీ ఆదాయాన్న సమకూర్చుకున్నారు. ఇప్పుడు అమెరికా దళాలు తప్పుకుంటే తాలిబన్ల ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. తాలిబన్లకు…
ఏకే 47, రాకెట్ లాంచర్లు ఉంటేనే ఆఫ్ఘనిస్తాన్‌ను గజగజవణికిస్తున్నారు. అదే అధుతాన ఆయుధాలు, వైమానిక ఆయుధసంపత్తి ముష్కరుల చేతికి దొరికితే ఇంకేమైనా ఉన్నదా… ఆఫ్ఘన్ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. గత 20 ఏళ్ల కాలంలో 89 బిలియన్ డాలర్లతో ఆఫ్ఘనిస్తాన్‌కు అమెరికా అధునాత ఆయుధాలు, యుద్ద విమానాలు, హెలికాఫ్టర్లు, యుద్ధ ట్యాంకులు, 11 వైమానిక స్థావరాలను సమకూర్చింది. ఎలా వీటిని వినియోగించాలో సైనికులను తర్ఫీదు ఇచ్చింది. సైనిక శిక్షణ ఇచ్చింది. ఇన్ని చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో దళాలు తప్పుకోవడంతో ఆ దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సెప్టెంబర్ 11 వరకు పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా, ఆ ప్రక్రియను అమెరికా వేగవంతం చేయడంతో తాలిబన్లు దురాక్రమణకు పాల్పడ్డాయి. వేగంగా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నాయి. ఆదివారంరోజున రాజధాని కాబూల్ నగరంలోకి ప్రవేశించడంతో ఆఫ్ఘన్ తాలిబన్ల వశం అయింది. ఈ పరిస్థితికి అమెరికానే కారణం అని ప్రపంచం మొత్తం విమర్శలు చేస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్…
తాలిబన్లు కాబూల్‌లోకి చొచ్చుకొస్తుండటంతో అన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నాయి. తమ ఉద్యోగులు, సిబ్బందిని స్వదేశానికి తరలించేందుకు పెద్ద ఎత్తున విమానాలను సిద్దం చేశారు. ఆర్మీ హెలికాప్టర్లు, విమానాలు అన్నింటిని స్వదేశానికి తరలించేందుకు కాబూల్ ఎయిర్‌పోర్టులో ఉన్నాయి. అయితే, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తొలుత వారి దేశానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బ్రిటన్ తమ వారిని తరలించిన తరువాతే మిగతావారిని తరలిస్తామని చెబుతుండటంతో ఆఫ్ఘన్లు ఆందోళన చెందుతున్నారు. ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో…
2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ టవర్స్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో వరల్డ్ ట్రేడ్ టవర్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు జూనియర్ బుష్ ఆఫ్ఘనిస్తాన్‌లోని అల్‌ఖైదా నాయకుడు లాడెన్ ఉన్నాడని, అతడిని తమకు అప్పటించాలని అమెరికా కోరింది. కానీ, అందుకు అప్పటి తాలిబన్ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ఆఫ్ఘన్‌లోని తాలిబన్ సేనలపై అమెరికా సైనికులు దాడులు చేశారు. తాలిబన్లను తరిమికొట్టి ఆ దేశంలో ప్రజాస్యామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పారు. అప్పటి…
తాలిబన్ల పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నది. లక్షలాది మంది సైనికులు, ఆధునిక ఆయుధసంపత్తి, 20 ఏళ్లుగా అమెరికా సైన్యం ఇచ్చిన ట్రైనింగ్‌లో రాటు తేలిన ఆఫ్ఘన్ సైనికులను రెండు వారాల వ్యవధిలోనే ఓడించి దేశాన్ని వారి చేతుల్లోకి తీసుకున్నారు. తాము లేకున్నా, ఆఫ్ఘన్ సైనికులు పోరాటం చేయగలరనే ధీమాతో ఆమెరికా అక్కడి నుంచి వైదొలిగింది. సెప్టెంబర్ 11 వరకు ఆఫ్ఘన్ నుంచి పూర్తిగా వెనక్కి వచ్చేయాలని ఆమెరికా నిర్ణయం తీసుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోయారు. చాలా ప్రాంతాల్లో…
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా కోలుకోలేదు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడుతుండటంతో మరింత రక్షణ కోసం మూడో డోస్ వ్యాక్సిన్‌ను ఇవ్వాలని అమెరికా సీడీసి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సగం జనాభాకు రెండు డోసుల వ్యాక్సిన్లను అందించారు. మూడో డోస్ ఇవ్వడం వలన అదనపు రక్షణ కలుగుటుందని రెండు డోసులు తీసుకున్నవారికి మూడో డోసు ఇవ్వాలని సీడీసి పేర్కొన్నది. అవయవ మార్పిడి చేయించుకున్నవారు, ఇతర కారణాల చేత బలహీనంగా ఉన్న వ్యక్తులు…
అమెరికా-పాక్ దేశాల మధ్య మంచి మైత్రి ఉన్నది. అయితే, ఈ మైత్రి గత కొంతకాలంగా సజావుగా ఉండటంలేదు. పాక్‌లో ఉగ్రవాదం పెరిగిపోవడంతో పాటుగా, ఆ దేశం చైనాతో బలమైన సంబందాలు కలిగి ఉండటం వలన అమెరికా పాక్ కు దూరమైందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రెండు దశాబ్దాల కాలం క్రితం అమెరికా దళాలు అఫ్ఘనిస్తాన్‌లో అడుగుపెట్టి తాలిబన్, ఆల్‌ఖైదా వంటి తీవ్రవాద సంస్థలపై విరుచుకుపడ్డాయి. ఆ సమయంలో పాక్ సహకారంలో అమెరికా తాలిబన్ల ఆటకట్టించింది. ప్రస్తుతం అమెరికా-పాక్…