ఫ్రాన్స్, అమెరికా దేశాల మధ్య ప్రస్తుతం ఆధిపత్యపోరు జరుగుతున్నది. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశం తన బలాన్ని పెంచుకోవడంతో చెక్ పెట్టేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి అకూస్ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసేందుకు 2016లో ఒప్పంగం కుదుర్చుకున్న అస్ట్రేలియా దానిని పక్కన పెట్టింది. 60 బిలియన్ డాలర్లలో 12 జలాంతర్గాముల తయారీ కోసం ఒప్పందం కుదుర్చుకున్నది. అకూస్ కూటమి తెరమీదకు రావడంతో డీజిల్ జలాంతర్గాముల స్థానంలో అణువిత్యుత్‌తో నడిచే జలాంతర్గాములను అస్ట్రేలియాకు అమెరికా ఆఫర్ చేసింది. దీనిపై ఫ్రాన్స్ తీవ్రస్థాయిలో మండిపడింది. అకూస్ కూటమి చర్యలను నిరశిస్తూ అస్ట్రేలియా, అమెరికా నుంచి తమ రాయబారులను వెనక్కి రప్పించింది. యూరప్‌లో ఫ్రాన్స్ బలమైన దేశం కావడంతో ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయో అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
Read: సురక్షితంగా ల్యాండైన అంతరిక్ష పర్యాటకులు….