ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కొలువుదీరింది. తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చైనా తామున్నామని హామీ ఇచ్చింది. హామీతో పాటుగా ఆ ప్రభుత్వానికి రూ.229 కోట్ల రూపాయలను తక్షణ సాయంగా అందించింది. ఎలాగైనా ఆఫ్ఘనిస్తాన్‌ను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి చైనా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. పాక్ అనుకూల వర్గం చేత ఈ పని చేయిస్తున్నది చైనా. అటు రష్యాకూడా ఆఫ్ఘన్ విషయంలో వేగంగా పావులు కదుపుతున్నది. రష్యాకు ఆక్రమణలకు వ్యతిరేకంగా ఏర్పటిన సంస్థే తాలిబన్. రష్యా సేనలు వైదొలిగిన తరువాత ఆ దేశంలో తాలిబన్ ప్రాబల్యం పెరిగింది. 1996లో ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. 2001 వరకు అరాచక పాలన సాగించారు. అమెరికా సేనలు ప్రవేశించడంతో తిరిగి అక్కడ ప్రజాస్వామ్య పాలన సాగింది. ఇప్పుడు అమెరికా సేనలు తప్పుకోవడంతో తాలిబన్లు మరోసారి దేశాన్ని ఆదీనంలోకి తీసుకున్నారు. అయితే, తాలిబన్ల ప్రభుత్వాన్ని ఐరాస సభ్యదేశాలు ఇప్పటి వరకు గుర్తించలేదు. తాలిబన్ ప్రభుత్వంలోని 14 మంది నేతలు ఐరాస ఉగ్రవాద లిస్టులో ఉన్నారు. ఇక ఆఫ్ఘన్‌లోని తాలిబన్ ప్రభుత్వానికి చైనా సాయం చేయడంపై అమెరికా స్పందించింది. తాలిబన్లతో వేగడం అంత సులభమైన విషయం కాదని, దీనిని చైనా, రష్యా, పాక్‌లు ఎలా అధికమిస్తాయో చూడాలని అన్నారు. ఒక్క మహిళకు కూడా ఆఫ్ఘన్ ప్రభుత్వంలో తాలిబన్లు స్థానం కల్పించలేదు. తాలిబన్ల చర్యలను బట్టే గుర్తింపు ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
Read: హర్యానాలో కొనసాగుతున్న రైతుల ఆందోళన… ఈనెల 27న భారత్ బంద్…